Site icon HashtagU Telugu

Avacado Benefits: అవకాడో తింటే ఆ రోగం రాదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Avacode

Avacode

అవకాడోని చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. మరి కొంతమంది అవకాడోని ఇష్టపడరు. దీనిని చాలామంది వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అవకాడో లో శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఇత‌ర సూక్ష్మ పోష‌కాలు ఉంటాయి. అవకాడో డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడని వారు ఉప్పు, మిరియాలు, నిమ్మ‌ర‌సంతో క‌లిపి ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. అలాగే మిల్క్ షేక్‌ల లోనూ శాండ్‌విచ్, బర్గర్, సలాడ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వంటకాల్ని అవకాడోతో మనం తయారు చేసుకుతినొచ్చు.

తరచూ మనం తినే ఆహారంలో కూడా అవకాడో ని చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే చాలామంది ఈ అవకాడో ఫ్రూట్ బాగుండదు అని తినడానికి ఇష్టపడరు. కానీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు. అవకాడో కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అవకాడోలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఈ మొదలైనవి..ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

అలాగే అవకాడో నోరు, చర్మం, ప్రోస్టేట్ కాన్సర్ లు రాకుండా ఉపయోగపడుతుంది. అవకాడో యాంటీ కాన్సర్ గుణాలు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే ఈ విధంగా ఒత్తిడి లెవెల్స్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది.