Site icon HashtagU Telugu

Asthma Patients : ఆస్తమా ఉన్నవారు వానాకాలంలో ఈ ఆహార పదార్థాలు తినకూడదు..

Asthma Patients avoid these foods in rainy season

Asthma Patients avoid these foods in rainy season

ఎండలు తగ్గి వానలు(Rains) మొదలయ్యాయి. అయితే ఆస్తమా పేషేంట్స్(Asthma Patients) కి వానాకాలం(Rainy Season), చలికాలం వచ్చింది అంటే శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆస్తమా ఉన్న వారు ఎవరైనా సరే వారు తినే ఆహారపదార్థాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే శ్వాసకు సంబంధించి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

ఆస్తమా ఉన్నవారు కూలింగ్(Cooling) పదార్థాలు తినకూడదు. ఇంకా పుల్లని పెరుగు, నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలను తినకూడదు. ఆస్తమా ఉన్నవారు ఐస్ క్రీం తినకూడదు, చల్లని నీరు, కూల్ డ్రింక్స్ వంటివి తాగకూడదు. ఆస్తమా ఉన్నవారు వీటిని తింటే దగ్గు మరియు శ్వాస సంబంధ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజుల్లో అందరూ ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం అలవాటే కానీ ఆస్తమా ఉన్నవారు టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమా ఉన్నవారు టీ లేదా కాఫీ తాగడం వలన వారికి గ్యాస్ సమస్య వస్తుంది. దానితో వారికి ఆస్తమా సమస్య ఎక్కువ అవుతుంది.

నిలువ పచ్చళ్ళు, ఫ్రిజ్ లో పెట్టిన ఆహార పదార్థాలు, ప్యాక్డ్ జ్యూస్ లు వంటివి ఆస్తమా ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే వీటి వలన ఆస్తమా సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆస్తమా ఉన్నవారు తాము తినే ఆహార పదార్థాలను చూసుకొని తినాలి లేకపోతే ఆస్తమా సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఆస్తమా ఉన్న వారు తినకూడని ఆహారపదార్థాలను తెలుసుకొని జాగ్రత్తగా తినాలి అప్పుడే ఈ వానాకాలంలో వారి ఆరోగ్యం బాగుంటుంది.

 

Also Read : Mung Bean Benefits: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. పెసరపప్పుతో ఇలా చేయాల్సిందే?