ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మాట్లాడుతున్న జీవనశైలితో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ లేదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్యలు కీళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి. చిన్న వయసు వారు కూడా ఈ కీళ్లనొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఈ కీళ్ల నొప్పులు సమస్యతో ఇబ్బంది పడేవాడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అన్న విషయానికి వస్తే..
చక్కెర పదార్థాలను ఎక్కువగా తినకూడదట. ఇది చాలా టేస్టీగా ఉన్నాయి అని ఎక్కువగా తింటే మాత్రం కీళ్ల నొప్పులు బాగా ఎక్కువ అవుతాయట. మీకు కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం తీపీ పదార్థాలను తినడం మానుకోవాలనీ సూచిస్తున్నారు. ముఖ్యంగా చాక్లెట్, సోడా, మిఠాయి, జ్యూస్ లు, స్వీట్ డ్రింక్స్, కొన్ని సాస్ లలో కూడా చక్కెర ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయట. అదేవిధంగా గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. గ్లూటెన్ గోధుమ, బార్లీ తో సహా కొన్ని ఇతర ధాన్యాలలో ఉంటుంది. గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు.
అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అనగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వంటివి అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ మన ఆరోగ్యానికి ఏ రకంగానూ మేలు చేయవట. వీటిని తింటే లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీనిలో శుద్ధి చేసిన చక్కెర, శుద్ధి చేసిన ఆహార ధాన్యాలను ఉపయోగిస్తారు. ఇవి ఆర్థరైటిస్ నొప్పి, మంటను మరింత పెంచుతాయట. అందుకే ఆర్థరైటిస్ పేషెంట్లు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అదేవిధంగా మందును విపరీతంగా తాగడం వల్ల ఎన్నో రోగాల ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి పెరుగుతుందట. ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు మందును తాగితే సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఉప్పును అతిగా తినడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి బాగా పెరుగుతుందట. ప్యాకెట్ ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్ రోగులు ఆహారంలో ఉప్పు తక్కువగా చేర్చుకోవాలనీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.