Site icon HashtagU Telugu

Infertility: డబ్ల్యూహెచ్వో తాజా నివేదిక.. ప్రతి ఆరు మందిలో ఒకరికి ఆ సమస్య?

Infertility

Infertility

ప్రస్తుత రోజుల్లో చాలామంది పెళ్లయిన తర్వాత వెంటనే పిల్లలు వద్దనుకొని ఆ తర్వాత కొంచెం లేటుగా పిల్లలు కొనాలి అని భావిస్తున్నారు. కానీ వారి పిల్లలు కావాలి అనుకున్న సమయానికి పిల్లలు కలగక హాస్పిటల్ చుట్టూ గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకే మన పెద్దవారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అని అంటూ ఉంటారు. దాంతో ప్రస్తుతరోజుల్లో ఆ ప్రతి ఆరుగురులో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కొత్త నివేదికను తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుత కాలంలో ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానంలేమి సమస్యలతో బాధపడుతున్నట్లుగా తన కొత్త నివేదికలో పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ. ప్రస్తుత జనాభాలో 17.5% మందికి ఈ సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించడం కోసం సంతాన సాఫల్యత చర్యలను చేపట్టాలని అవి అందరికీ అందుబాటులో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సంస్థ సూచించింది. ఈ సమస్యకు ప్రాంతాలతో సంబంధం లేదని, పేద, ధనిక, మధ్య ఆదాయం మధ్య ఉన్న దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నట్టు వెల్లడించింది.

అధిక ఆదాయ దేశాల్లో ఇది 17.8% ఉండగా తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో ఇది 16.5 శాతం గా ఉన్నట్లు తెలిపింది. మామూలుగా 12 నెలలు లేదంటే అంతకన్నా ఎక్కువ కాలం దంపతులు కలిసి ఉన్నా కూడా గర్భం దాల్చని పరిస్థితిని వంధ్యత్వంగా అభివర్ణిస్తున్నారు. ఇంతమంది సంతానలేని సమస్యతో ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వేదికలో పేర్కొంది. అలాగే సంతాన సౌఫల్యత సౌకర్యాలను విస్తరించి, వాటిని అందుబాటు ధరల్లో ఉంచాలని, తక్కువ వ్యయం భద్రతతో కూడిన విధానాలను తేవాల్సిన అవసరం ఉంది అని డబ్ల్యూ హెచ్ ఓ డైరెక్టర్ టెడ్రోస్ అద్నాం గేబ్రియేసన్ అన్నారు. సంతానలేమీ దంపతుల మనోవేదన సమాజంలో ఒక కలంకం అని ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని, అది ప్రజల మానసిక శ్రేయస్సు పై ప్రభావం చూపిస్తుందని నివేదిక వెల్లడించింది.

Exit mobile version