Site icon HashtagU Telugu

Baldness: మీ వేళ్లు అలా ఉన్నాయా? అయితే బట్టతల వస్తుంది..

Are Your Fingers Like That.. But Baldness Comes

Are Your Fingers Like That.. But Baldness Comes

ఎంతోమంది పురుషులు బట్టతల (Baldness) సమస్యతో బాధపడుతుంటారు. చాలామంది చిన్న వయస్సులోనే తలపై జుట్టును కోల్పోతారు. ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు తక్కువ సైజులో ఉన్న పురుషులకు బట్టతల (Baldness) వచ్చే అవకాశం 6 రెట్లు ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

స్త్రీలకు కూడా అంతే..

జుట్టు రాలడం, పల్చబడడం అనేది పురుషులకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో.. స్త్రీలకు కూడా అంతే ఇబ్బంది. స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ అందమైన , ఆరోగ్యకరమైన జుట్టును కోరుకుంటారు. మీ లుక్ తో పాటు వ్యక్తిత్వంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల  జుట్టు దృఢంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీజీవనశైలి, ఆహారం, కాలుష్యం, వ్యాధులు వంటి అనేక కారణాల వల్ల పురుషుల్లో బట్టతల సమస్య వస్తుంది. నుదురు పై భాగంలో జుట్టు నిరంతరం తగ్గుతూ ఉండటం.. జుట్టు మందం తగ్గడం అనేవి రాబోయే బట్టతలకు సంకేతాలు.

అనేక పరిశోధనలు..

పురుషుల్లో బట్టతల సమస్య రాకుండా ఉండేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది ? దాని కారకాలు ఏమిటి ? దానిని ఎలా ఆపవచ్చు ? అనే దిశగా శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నారు.

బట్టతలకు (Ba;dness) వేళ్లతో లింక్ ఉందా?

తైవాన్‌లో ఇటీవల జరిపిన ఒక పరిశోధనలో ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు చిన్నగా ఉన్న పురుషులకు బట్టతల వచ్చే అవకాశం 6 రెట్లు ఎక్కువని తేలింది. కుడిచేతి ఉంగరపు వేలు అదనపు పొడవున్న పురుషులలో బట్టతల ప్రాబ్లమ్ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 37 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న 240 మంది పురుషుల చేతి వేళ్ళను విశ్లేషించారు. వీరికి బట్టతల (ఆండ్రోజెనిక్ అలోపేసియా) ఉందని గుర్తించారు. జుట్టు పెరుగుదల చక్రాన్ని ప్రభావితం చేసే డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే సెక్స్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు సాధారణంగా బట్టతల ఏర్పడుతుందని తెలిపారు.

“రెండవ వేలు మరియు కుడి చేతి యొక్క నాల్గవ వేలు నిష్పత్తి తక్కువగా ఉంటే, బట్టతల వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని మా అధ్యయనం కనుగొంది” అని తైవాన్‌లోని కాహ్‌సియుంగ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ చింగ్ యింగ్ వు చెప్పారు.ఉంగరపు వేలు పెద్దగా ఉన్న పురుషులలో అధిక టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదల అవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సెక్స్ హార్మోన్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం మరియు పురుషులలో ఆటిజంతో పాటు బట్టతల వస్తుంది.

ఆండ్రోజెనిక్ అలోపేసియా అంటే ఏమిటి?

పురుషులలో జుట్టు రాలడాన్ని ఆండ్రోజెనిక్ అలోపేసియా లేదా మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటారు. ఈ స్థితిలో జుట్టు కుదుళ్లు నెమ్మదిగా చనిపోతాయి. దీని కారణంగా కొత్త జుట్టు పెరగదు. హెయిర్ ఫోలికల్స్ దగ్గర రక్త నాళాలు (రక్త నాళాలు) లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.

Also Read:  Campa Soft Drinks: సాఫ్ట్‌ డ్రింక్స్‌ పై కొత్త వ్యూహాన్ని పన్నిన జియో!