Chicken: చికెన్ ని వండేముందు శుభ్రం చేస్తున్నారా.. అయితే తెలుసుకోవాల్సిందే?

ఇటీవల కాలంలో రోజురోజుకీ మాంసాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీంతో కనీసం వారంలో రెండు

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 04:42 PM IST

ఇటీవల కాలంలో రోజురోజుకీ మాంసాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీంతో కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా ఇంట్లో చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. ఎక్కువ శాతం మంది చికెన్ ని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే చికెన్ ని వివిధ రకాలుగా తయారు చేసుకుని తినడానికి ఇష్టపడుతున్నారు. కాగా చికెన్ చేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న చికెన్ శుభ్రం చేసి చేయాలా లేకపోతే అలా చేయాలా అని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది.

కొంతమంది చికెన్ ని శుభ్రం చేసి కూర చేస్తే మరి కొంతమంది అలాగే చేసేస్తూ ఉంటారు. మరి చికెన్ ని శుభ్రం చేయవచ్చా ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా షాప్ నుంచి చికెన్ ని తెచ్చుకున్న తర్వాత కచ్చితంగా కడగాలి అని అంటూ ఉంటారు. కానీ నిపుణులు మాత్రం ఆ చికెన్ కడగడం వల్లా ఆహారం విషతుల్యం అవుతుందని అంటున్నారు. చికెన్ కడిగేటప్పుడు మాంసం మీద ఉండే బాక్టీరియ చేతుల్లోకి చేరి కడుపులోకి వెళ్లే అవకాశం వుందట. పచ్చి కోడి మాంసంపై సాల్మోనెల్లా, క్యాంపిలో బ్యాక్టీరియ ఉంటుందట.

కుళాయి కింద చికెన్ కడగడం వల్ల ఆ బ్యాక్టీరియ వంట పాత్రలపై, దుస్తులపై పత్రాలపై పడుతుంది. ఈ బ్యాక్టీరియ వల్ల డయేరియా, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వస్తాయి. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా నుంచి చిన్నపిల్లలకు ముసలివారికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. షాప్ నుండి ఇంటికి తీసుకొచ్చిన చికెన్ ను కడగకుండా సరిపోయే టెంపరేచర్ లో ఉడికించాలి. ఒకవేళ చికెన్ మీద ఉన్న రక్తం మరకలు ఇబ్బందికరంగా అనిపిస్తే పేపర్ లేదా టవల్ తో తుడిచేయాలి. ఆ తర్వాత పేపర్ టవల్ ను జాగ్రత్తగా డస్ట్ బిన్ లో వేయాలి. పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్ లో జాగ్రత్తగా స్టోర్ చేయాలి. ఇతర ఆహార పదార్థాలు మాంసాహారానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసం పట్టుకున్న చేతులను సబ్బుతో లేదా వేడినీటితో శుభ్రం చేసుకోవాలి.