Salt Effects: ఉప్పు.. ముప్పు, అతిగా వాడితే అంతే మరి!

ఆరోగ్యం (Health)పై అవగాహన వచ్చింది. కానీ ఉప్పును మాత్రం అవాయిడ్ చేయలేకపోతున్నారు

  • Written By:
  • Updated On - April 14, 2023 / 03:10 PM IST

ఇప్పుడు చాలా మందికి ఆరోగ్యం (Health)పై అవగాహన వచ్చింది. కానీ ఉప్పును మాత్రం అవాయిడ్ చేయలేకపోతున్నారు. సోడియం అనేది ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. ఇది ఎంజైమ్ కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు కండరాల సంకోచాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఫ్లూయిడ్ బ్యాలెన్స్, బ్లడ్ షుగర్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే నరాలు, కండరాల పనితీరు,గుండె పనితీరును నియంత్రిస్తుంది.

రోజుకు 9 నుంచి 12 గ్రాముల మధ్య మాత్రమే ఉప్పు (Salt) తీసుకోవాలి. గరిష్ట స్థాయి అంటే దీనికి రెండు రెట్లు ఎక్కువ. అయితే మనం పని చేస్తున్నప్పుడో లేదంటే వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రం చెమట ద్వారా కాస్తంత ఎక్కువ సోడియంను కోల్పోతాం కాబట్టి ఇలాంటి సమయంలో మరో రెండు గ్రాముల ఉప్పు అదనంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉప్పును మోతాదుకు మించి వాడితే మాత్రం పోతారని నిపుణులు (Doctors) చెబుతున్నారు. ఉప్పు అధికంగా వాడితే గుండె, కిడ్నీలు, రక్తపోటు వంటి వాటిపై ప్రభావం పడుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కూడా ఉప్పే ప్రధాన కారణం. దీంతో మనం ఉప్పు అధికంగా తీసుకుంటే అనర్థాలే ఎక్కువగా వస్తాయి. దీంతో ఉప్పు వాడకం తగ్గించుకోకపోతే నష్టాలే. కానీ కొందరు మాత్రం లెక్కచేయడం లేదు.

ఉప్పు మన శరీరంలోకి (Body) కేవలం రుచి కోసమే తీసుకుంటున్నాం. దీని వల్ల నష్టాలని తెలిసినా మానడం లేదు. మన శరీరంలో ఉప్పు ఉంటుంది. మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం రుచి కోసమని ఉప్పును ఆశ్రయిస్తున్నాం. ఫలితంగా రోగాల బారిన పడుతున్నాం. అయినా మన తీరు మారడం లేదు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఉప్పును ఒకేసారి మానేయడం వీలు కాదు. రోజుకు కొంత తగ్గిస్తూ పోతుండాలి. సాధ్యమైనంత వరకు ఉప్పు (Salt) వాడకపోతే మనకు మంచి ఫలితాలు ఉంటాయి.

Also Read: 1Year Of KGF2: కేజీఎఫ్-2కు ఏడాది.. రాకీభాయ్ ఫ్యాన్స్ డిజాప్పాయింట్!