ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ అనేక రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా రకరకాల ఇయర్ ఫోన్స్ ని ఉపయోగిస్తున్నారు. కొంతమంది అయితే వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే చెవిలో పెట్టుకుని పాటలు వినడం ఫోన్లో మాట్లాడడం లాంటివి చేస్తూనే ఉంటారు. రాత్రి పడుకునే వరకు కూడా వీటిని చెవులకు అలాగే తగిలించుకొని ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వినికిడి సమస్యలు వస్తాయి అని తెలిసి కూడా చాలా మంది వాటిని అలాగే ఉపయోగిస్తూ ఉంటారు.
వీటిని ఉపయోగించడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. చాలామంది ఇయర్ ఫోన్స్ సౌండ్ ఎక్కువగా పెట్టుకునే పాటలు విని విని వినికిడి సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఒక నివేదిక ప్రకారం వినికిడి సమస్యకు ముఖ్య కారణం ఇయర్ ఫోన్స్ అతిగా ఉపయోగించడమే అని తేలింది. వీటిని మరింత ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆ సమస్య అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల ప్రస్తుతం ఉన్న రోజులలో నలుగురిలో వినికిడి సమస్యలు వస్తున్నాయి. అది కూడా ఎక్కువగా యువతలో ఈ సమస్య తీవ్రంగా వస్తున్నాయి.
చెవిలో సమస్యలు రావడం దురదగా అనిపించడం ఏదో నొప్పిగా ఉండడం లాంటి సంకేతాలు కనిపిస్తే వాటిని వినికిడి సమస్యలుగా చెప్పడానికి తొలి లక్షణంగా తెలుసుకోవచ్చు. తాజాగా వస్తున్న హైటెక్ ఇయర్ ఫోన్స్ కొత్తగా మెరుగ్గా ఉన్న ప్రమాదం లేదని చెప్పలేమని చెప్తున్నారు. మీరు తప్పనిసరి పరిస్థితులలో ఇయర్ ఫోన్స్ వాడాల్సి వస్తే ప్రతి 30 నిమిషాలకు కనీసం 10 నిమిషాలు అయినా బ్రేక్ ఇచ్చి తర్వాత ఉపయోగించడం మంచిది.