Lemon Juice Tips : పరగడుపున తేనే, నిమ్మరసం తీసుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడం కోసం అలాగే కొలస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవడానికి ఇలా తేనే, నిమ్మరసం (Lemon Juice) కలిపిన నీళ్లను తాగుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 07:20 PM IST

Tips to be followed while drinking Lemon Juice with Honey Early in the Morning : మనలో చాలామంది ఉదయం లేవగానే పరగడుపున తేనే నిమ్మరసం కలిపిన నీళ్లను తాగుతూ ఉంటారు. అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడం కోసం అలాగే కొలస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవడానికి ఇలా తేనే (Honey), నిమ్మరసం (Lemon Juice) కలిపిన నీళ్లను తాగుతూ ఉంటారు. ఈ రెండు కలిపిన నీళ్లను తీసుకోవడం వల్ల ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. చాలామంది ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు పరిగడుపున దాన్లో తేనె, నిమ్మ రసం కలుపుకొని తాగుతూ ఉంటారు. నిమ్మరసం (Lemon Juice), తేనె (Honey) ఈ రెండిట్లోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పాతకాలం నుండి నిమ్మరసం తేనెలను సహజ సిద్ధమైన వైద్యంలో వాడుతూ ఉంటారు.

కాబట్టి పరిగడుపున తీసుకుంటే మంచిది అని అనుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియలో సహాయపడి వ్యర్ధాలను విషాలను బయటికి నెట్టివేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్ ను తరిమికొడుతుంది. అలాగే శరీరం నుండి విషాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. పెద్దప్రేగు పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రం అయ్యేలా చేస్తుంది. ఒకవేళ ఈ విధంగా తీసుకుంటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత కనీసం ఒక గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదు. తేనె వాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే చాలా మంచిది. జీర్ణం కానీ ఆహారం పేగు కణాలు చనిపోయిన బ్యాక్టీరియా ఉత్పత్తి కారణంగా తరచుగా మన కడుపులో లోపలి పొర పూస్తుంది. కావున ఆ పరిస్థితి ఉన్న వ్యాధులకు దారితీస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ తేనె కలిపి తీసుకోవడం వలన పేగు గోడలు ముఖ్యంగా పెద్దప్రేగు వచ్చే విషాలను బయటకు పంపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ప్రేగు పక్షాలను జరుగుతుంది. దానివల్ల శరీరంలో పోషకాలను గ్రహించడానికి విషయాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రేగు కదిలికలను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది.

Also Read:  Yamaha Bikes: మార్కెట్‌లోకి మరో రెండు కొత్త బైక్స్ రిలీజ్‌ చేసిన యమహా.. ధర, ఫీచర్స్ ఇవే?