Site icon HashtagU Telugu

Heart Attack: ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే గుండెకు ప్రమాదం!

Dexa Scan Vs Heart Attack

Dexa Scan Vs Heart Attack

నేటి యువతలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒక్కోసారి ఆకస్మికంగా కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో శరీరంలో కనిపించే కొన్ని సంకేతాలను ముందుగానే పసిగట్టడం ద్వారా గుండెపోటు నుంచి జాగ్రత్త పడవచ్చు. వెన్నునొప్పి..మీరు శరీరంలో వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటే మరియు ఈ సమస్య నిరంతరం కొనసాగితే, అది కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు. వెన్నునొప్పి కారణంగా పనితీరు కూడా ప్రభావితమవుతుంది.

మీకు తరచుగా వెన్నునొప్పి ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఛాతి నొప్పి..ఇది గుండెపోటుకు అతిపెద్ద సంకేతంగా పరిగణించవచ్చు. చాలామంది ఛాతీ నొప్పిని గ్యాస్ నొప్పిగా భావిస్తారు. నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఛాతీ నొప్పితో పాటు, విపరీతమైన భయం, చెమటలు పట్టడం కూడా గుండెపోటుకు ముందస్తు సంకేతాలు. జీర్ణ సమస్యలు..కాగా ఆహారంలో పొరపాట్లు కారణంగా, జీర్ణవ్యవస్థ బలహీనపడటం ప్రారంభమవుతుంది.

అటువంటి పరిస్థితిలో అజీర్తి, గ్యాస్‌ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు నిరంతరం కొనసాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు రోజూ వ్యాయామం చేయాలంటున్నారు. వీటికి దూరంగా ఉండాల్సిందే..సిగరెట్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే, ఈ రోజు నుంచే ఈ అలవాటును మానుకోవాలి.