Health: గొంతునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి

  • Written By:
  • Updated On - December 7, 2023 / 04:39 PM IST

Health: ప్రస్తుతం ఈ సీజన్ లో చాలామంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అలాంటివారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల సమస్యకు చెక్ పెట్టొచ్చు. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి గార్గింగ్ చేస్తే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. వెనిగర్ లేకపోయినా.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గింగ్ చేసుకోవచ్చు.

ఒక కప్పు నీటిలో 4, 5 మిరియాలు, కొన్ని తులసి ఆకులను వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని తాగాలి. ఈ కషాయాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే బాగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు.. గొంతునొప్పి త్వరగా నయమవుతుంది.

గొంతు నొప్పికి మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే నల్ల మిరియాలతోపాటు బాదంపప్పును కలిపి నూరి కొంచెం నీటిలో కలిపి సేవించడం వల్ల కూడా గొంతు వ్యాధులు నయమవుతాయి. ఏమైనా మందులు వాడాల్సి వచ్చినప్పుడు డాక్టర్ ను సంప్రదించి వాడాల్సి ఉంటుంది.