Site icon HashtagU Telugu

Kidney Stones : కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆరు తప్పులు అస్సలు చేయకండి?

Are You Suffering From Kidney Stone Problem.. But Don't Do These 6 Mistakes At All..

Are You Suffering From Kidney Stone Problem.. But Don't Do These 6 Mistakes At All..

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల (Kidney Stones) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు ఈ సమస్యని మొదట్లోనే తెలుసుకొని అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరికొందరు దానిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల సమస్య మరింత పెద్దది అయి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి సమస్యని మరింత పెంచుకుంటున్నారు. అయితే కిడ్నీ (Kidney) సమస్యతో బాధపడుతున్న వారు ముఖ్యంగా ఆరు రకాల తప్పులు అస్సలు చేయకూడదు అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

చాలామంది కిడ్నీలో నొప్పిగా అనిపించినప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మింగి మౌనంగా ఉంటారు. మళ్లీ రెండు రోజులకు ఆ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి కేవలం మందులు రాయించుకుని వాటి మింగుతూ మరి సమస్యని మరింత పద్ధతిగా చేసుకుంటూ ఉంటారు. అయితే అలా నొప్పి తీవ్రమైనప్పుడు వెంటనే వైద్యుని కలిసి టెస్టులు చేయించుకోవడం వల్ల సౌండ్ పరీక్షలో మనకు తెలుస్తుంది. చాలామంది ఇది చెయ్యకుండా మందులు రాయించేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి క్రియేటింగ్ కూడా పెరగవచ్చు. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ అని తెలిసిన వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సరైన ఆహారం తీసుకోకపోవడం సరిగా నీళ్లను కాకపోవడం శరీరంలో నీళ్ల కొరత ఉండడం వల్ల ఈ రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

శరీరానికి తగిన నీళ్లు తాగకపోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలామంది వైద్యుల సలహా తీసుకోకుండా ఇరుగుపొరుగు వారు చెప్పినట్టు ఏవేవో ఇంటి చిట్కాలను పాటిస్తూ సమస్యని మరింత పెద్దది చేసుకుంటూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫలితంగా ఆ కిడ్నీలో రాళ్లు పెద్దవి అయిపోతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న రోగులు కూడా హోమియోపతి ద్వారా సమస్యను తగ్గించుకున్నారు. కాబట్టి ఏ వైద్యమైనా గొప్పదే కానీ ఏదైనా డాక్టర్ గారి సలహా తీసుకుని చేయడం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లాలి ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మీతో పాటు మీరు ఉపయోగించే మెడిసిన్స్ ని తీసుకుని వెళ్లడం మంచిది. అలాకాకుండా వేరే ఊరు వెళ్లినప్పుడు వెళ్ళినప్పుడు హఠాత్తుగా నొప్పి వస్తే వెళ్లి దగ్గర్లో ఉన్న డాక్టర్కు చూపిస్తారు.

నిజానికి ఆ డాక్టర్ కి మీ మెడికల్ హిస్టరీ తెలియదు. మందు ఏం వాడుతున్నారో తెలియదు. ట్రీట్మెంట్ తెలియదు చాలా చాలా ముఖ్యం. చాలామంది ఇప్పటికీ నాటువైద్యం అని మంత్రాలని చేయించుకుంటూ ఉంటారు. నిజానికి మంత్రాలకు చింతకాయలు నిజానికి మంత్రానికి చిట్కాలు రాలవు. ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. నిజానికి అవి కూడా పనిచేయవు కాబట్టి కిడ్నీలో రాళ్లు వచ్చాయని అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ గారికి చూపించి వైద్యం చేయించడం ఒక్కటే మార్గం.

Also Read:  Mails : జీ మెయిల్ లో అవసరమైన ఈ మెయిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ తో ఆ సమస్యకు చెక్ పెట్టండిలా?