Hormone Imbalance: హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ సమస్యతో బాధపడుతున్నారా?

హార్మోన్ల అసమతుల్యత కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోతే.. థైరాయిడ్, పి.సి.ఓ.డి, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలా మంది హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత (Hormone Imbalance) వల్ల ఇటీవలి కాలంలో థైరాయిడ్, పి.సి.ఓ.డి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. హార్మోన్లు సక్రమంగా విడుదల కావాలి. హార్మోన్ల స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటే మన శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత (Hormone Imbalance) మనలో శారీరక, మానసిక మార్పులకీ, భావోద్వేగాలకీ కారణమవుతుంది. హార్మోన్ల అసమత ఉంటే.. ఆందోళన, జననేంద్రియాల దగ్గర పొడిబారడం, మూడ్‌స్వింగ్స్‌, జుట్టు విపరీతంగా రాలిపోవడం, అలసట, మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతాయి. హార్మోన్లను సమతుల్యం చేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మన డైట్‌లో క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన కూరగాయలు తీసుకుంటే.. హార్మోన్లు బ్యాలెన్స్‌ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

క్రూసిఫెరస్‌ కూరగాయలు:

క్యాబేజీ కుటుంబానికి (Genus Brassica) చెందిన కూరగాయలను క్రూసిఫెరస్‌ కూరగాయలు అంటారు.
    1. బ్రోకలీ
    2. కాలీఫ్లవర్
    3. కాలే
    4. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్
    5. బచ్చలికూర
    6. క్యాబేజీ

ఈ పోషకాలు ఉంటాయి:

క్రూసిఫెరస్ కూరగాయలలో గ్లూకోసినోలేట్‌లు ఉంటాయి. గ్లూకోసినోలేట్‌‌లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ నుంచి.. మన శరీర కణాలను రక్షిస్తాయి. క్రూసిఫెరస్ కూరగాయలలో కెరోటినాయిడ్స్ (బీటా-కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్), విటమిన్‌ సి, ఇ, కె, మినరల్స్‌ సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్రూసిఫెరస్ కూరగాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండుగా ఉంటాయి.

హార్మోన్లు బ్యాలెన్స్‌ చేస్తాయి:

క్రూసిఫెరస్ కూరగాయలలో 3,3-డైండోలిల్మెథేన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. తీసుకుంటే కాలేయంలోని మలినాలు బయటకుపోతాయి, ఈస్ట్రోజెన్‌ పని తీరు బాగుంటుంది. 3,3-డైండోలిల్మెథేన్ ఈస్ట్రోజెన్‌ స్థాయిలను బ్యాలెన్స్‌ చేస్తాయి. క్రూసిఫెరస్‌ కూరగాయలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వీళ్లు తీసుకోవద్దు:

క్రూసిఫరస్ కూరగాయల్లో థియోసైనేట్‌లు ఉంటాయి. ఇవి అయోడిన్ శోషణను నిరోధిస్తాయి. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు క్రూసిఫెరస్‌ కూరగాయలు ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. థైరాయిడ్‌ పేషెంట్స్‌.. క్రూసిఫెరస్‌ కూరగాయలు పచ్చిగా తీసుకోకూడదు. ఇవి ఉడికించి తినవచ్చు.

Also Read:  Godavari Water: ఏపీకి కేంద్రం మరో అన్యాయం! గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు..!