Site icon HashtagU Telugu

Hair Fall Tips : హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వాల్ నట్స్ తో ఈ విధంగా చేయాల్సిందే..

Are You Suffering From Hair Fall Problem.. But You Have To Do It Like This With Wall Nuts..

Are You Suffering From Hair Fall Problem.. But You Have To Do It Like This With Wall Nuts..

Hair Fall Tips : హెయిర్ ఫాల్.. ప్రస్తుత రోజుల్లో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఈ సమస్య కూడా ఒకటి. అయితే జుట్టు రాలడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఒకటి మనం తీసుకునే ఆహారపు అలవాట్లు అయితే రెండవది మన జీవన శైలి. వీటితో పాటుగా ఇంకా ఎన్నో రకాల కారణాలు కూడా ఉన్నాయి. అయితే హెయిర్ ఫాల్ (Hair Fall) సమస్యను అధిగమించడానికి చాలామంది అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు ఇంట్లోనే దొరికే వంటింటి చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాకపోయేసరికి దిగులు చెబుతూ ఉంటారు. అయితే ఇక మీదట ఆ దిగులు అక్కర్లేదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన వాల్ నట్స్ తో హెయిర్ ఫాల్ (Hair Fall) సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఈ డ్రైఫ్రూట్ తో హెయిర్ ఫాల్స్ సమస్యను ఎలా అదిగమించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

వాల్ నట్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఈ వాల్ నట్స్ బరువు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగయపడతాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు. దీనిని తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి చురుకుగా మారుతుంది. అయితే వాల్ నట్స్ ను తినడం వలన జుట్టుకు చాలా ఆరోగ్యకరం అని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పెరుగుదలకు వాల్ నట్స్ చాలా మంచివన్ని ఇది స్కాల్ప్ ను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. వాల్ నట్లను తింటే జుట్టు రాలడం ఇతర సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే జుట్టుకు వాల్ నట్స్ ను ఉపయోగించడం వలన జుట్టు పెరుగుదల మెరుగుపరుస్తుంది. వాల్ నట్స్ జుట్టు నుంచి చుండ్రు, దురద సమస్యను తొలగిస్తుంది. జుట్టు నల్లబడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది.

అందువలన ప్రతిరోజు రెండు వాల్ నట్స్ ను తినాలి. జుట్టుపై వాల్ నట్లను ఉపయోగించడానికి రెండింటినీ లేదా సరిపడే విధంగా తీసుకోవాలి. ఒకటిన్నర కప్పు వెజిటేబుల్ ఆయిల్ లో వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత దానిని ఫిల్టర్ చేసి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. పెరుగు వాల్నట్ పొడిని బాగా కలపాలి. ఆ తర్వాత తలకు అప్లై చేసి కాసేపు ఉంచాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. దీనివలన జుట్టుకు మంచి పోషకాలు అంది సమస్యలన్నీ దూరమవుతాయి.

Also Read:  Beans Fry: ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై.. ఇలా చేస్తే చాలు కొంచం కూడా మిగలదు?