Site icon HashtagU Telugu

Gastric Problem : గ్యాస్ట్రిక్ తో ఇబ్బందిపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి

Gastric Problem

Gastric Problem

గ్యాస్ట్రిక్ సమస్య (Gastric Problem) అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ఆరోగ్య సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, అసమతుల్యమైన జీవనశైలి కారణంగా గ్యాస్ట్రిక్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్యాస్ పెరిగి పొట్ట ఉబ్బిపోయి, అసౌకర్యంగా అనిపించడం, కడుపులో మంటలు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీర్ణవ్యవస్థతో పాటు లివర్, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం పడే అవకాశముంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనాన్ని పొందేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి. సహజసిద్ధమైన ఈ చిట్కాలను పాటించడం ద్వారా గ్యాస్ సమస్య తగ్గిపోవడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Sapthagiri : సినిమా వాళ్లకు పిల్లనివ్వరు.. సప్తగిరి వ్యాఖ్యలు.. ఇది ఇంకా మారలేదా..

గ్యాస్ట్రిక్ సమస్య(Gastric Problem)ను తగ్గించేందుకు సోంపు, లవంగం నూనె, యాలకులు, చియా సీడ్స్, అవిసెలు వంటివి సహాయపడతాయి. సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అసిడిటీ తగ్గుతుంది. లవంగం నూనెలో గల ఔషధ గుణాలు గ్యాస్ సమస్య తగ్గించడమే కాకుండా, అల్సర్ సమస్యను కూడా నివారించగలవు. అలాగే, యాలకులు, సోంపు, బ్రౌన్ షుగర్ మిశ్రమాన్ని పాలలో కలిపి తాగితే గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. చియా సీడ్స్, అవిసెలు కడుపులో తేమను పెంచి, శోథ నిరోధక గుణాలతో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచటంలో సహాయపడతాయి.

Rohit Sharma: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌నే.. మ‌న‌సు మార్చుకున్న బీసీసీఐ!

ఇక మజ్జిగ, హెర్బల్ టీలు, ఇంగువ వంటివి గ్యాస్ట్రిక్ సమస్య(Gastric Problem)ను సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయి. మజ్జిగలో కొద్దిగా పసుపు కలిపి తాగితే మరింత ప్రయోజనం పొందవచ్చు. అలాగే, మెంతి టీ, అల్లం టీ, చమోమిలే టీలు కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాలను తొలగించి, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి. గ్లాసు వేడి నీటిలో చెంచా ఇంగువ కలిపి తాగితే కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించుకోవడమే కాకుండా దైనందిన జీవితంలో ఆరోగ్యంగా ఉండొచ్చు.