Eye Sight Tips : కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే?

ఈ కంటిచూపు (Eye Sight) సమస్య నుంచి బయటపడాలి అంటే డైట్ ని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు.

Published By: HashtagU Telugu Desk
Are You Suffering From Eye Sight Problem.. But You Have To Follow This Diet..

Are You Suffering From Eye Sight Problem.. But You Have To Follow This Diet..

Tips to Reduce Eye Sight Problem : ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఆహార పదార్థాలు. సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు సమస్య మొదలవుతుంది. అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి.

కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. కంటి సమస్యలు వస్తే ఇక జీవితం అంత చీకటి మయం అవుతుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు డిజిటల్ ప్రపంచంలో మునిగిపోవడం వలన ఈ కంటి సమస్యలు కళ్లద్దాలు వస్తున్నాయి. కళ్ళలో దురద, మంట లాంటి సమస్యలు మొదలై కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. అయితే ఈ కంటిచూపు (Eye Sight) సమస్య నుంచి బయటపడాలి అంటే డైట్ ని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు. మరి ఎటువంటి డైట్ ని ఫాలో అవుతే కంటిచూపు (Eye Sight) మెరుగుపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా నారింజ, నిమ్మ,ద్రాక్ష,జామపండు, బత్తాయి వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి కళ్ళకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. వాల్ నట్స్ ,బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ కంటి చూపుని మెరుగుపడేలా చేస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ నిత్యం తీసుకోవాలి. దీంతో కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

కంటి చూపు మెరుగుపడాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పచ్చి కూరగాయలు కంటికి చాలా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ లాంటి అంశాలను కంటి చూపుని మెరుగుపరుస్తాయి. అలాగే ఉసిరి కూడా కళ్ళకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే జామకాయ పొడి, ఊరగాయ, ఉసిరి మిఠాయి ఇలాంటి జామకాయతో చేసిన పదార్థాలను తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అవకాడో లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వలన కంటి రెటేనా మెరుగుపడుతుంది. మీ కళ్ళు వృద్ధాప్యం వరకు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే క్యారెట్లులలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపుని అధికం చేస్తుంది.

Also Read:  Swiggy: ఒకే వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్‌ ఆర్డర్..!

  Last Updated: 16 Dec 2023, 11:07 AM IST