Tips on Dental Problems occurring in Winter Season : చలికాలంలో చాలామంది పంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా సెన్సిటివిటీ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో స్వీట్ తిన్న లేదంటే హాట్ వాటర్ చల్లని నీరు తాగినా కూడా వెంటనే నోట్లో పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. చిగుళ్ల నొప్పి అనేవి కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం చలికాలంలో చల్లటి వాతావరణంలో దంతాలు చిగుళ్లు సున్నితంగా మారడమే. ఈ దంతాల నొప్పి చిగుళ్ల నొప్పి సమస్యలకు (Dental Problems) వీలైనంత వరకు వంటింటి చిట్కాలే ఉపశమనాన్ని ఇస్తాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఒకవేళ మరీ భరించలేనంత నొప్పి కలిగితే అప్పుడు తప్పకుండ డాక్టర్‌ని సంప్రదించాలి. సాధారణంగా పంటి నొప్పి అనేది ఏదైనా చల్లటి పదార్ధం తిన్న లేక ఏదైనా తీపి పదార్ధం తిన్న తరువాత పంటి నొప్పి అనేది ఎక్కువగా వేధిస్తుంటుంది. దీని కారణంగా ఆహారం తినే సమయంలో నమలడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అది ఎంతలా అంటే చిన్న చపాతీ ముక్క నమలడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం మనం వాడే టూత్ పేస్ట్ అంటున్నారు దంత వైద్యులు (Dental Doctors). చాలా మంది పళ్ళు తెల్లగా కావాలని టూత్ పేస్ట్ ఎక్కువగా వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు బ్రష్ చేస్తుంటారు.
అలా ఎక్కువ సేపు బ్రష్ చేయడం వలన పంటి పై ఉండే ఎనామిల్ పోయి పళ్ళు సెన్సిటీవ్‌గా తయారవుతాయి. అలాంటి సమయంలో ఎక్కువగా పళ్ళు జివ్వు మనడం పంటి నరాలు లాగుతునట్లు అనిపించడం వంటివి ఎక్కువగా వేధిస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు భరించలేని నొప్పి చిగుర్లు వాపు రావడం వంటివి కూడా జరుగుతాయి. అలాంటి సమయంలో కొన్ని సందర్భాల్లో ఇంటి చిట్కాలతో వీటి చెక్ పెట్టచ్చు. అందులో ఒకటి సాల్ట్ వాటర్ పళ్ళు నొప్పిగా అనిపించినప్పుడు కానీ జివ్వుమని లాగినప్పుడు కొన్ని గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. రెండోది వెల్లుల్లి. వెల్లులిలో ఉండే అలిసిన్ అనే ఔషధం పంటి నొప్పిని తొందరగా తగ్గిచేస్తుంది. మూడవది లవంగం. లవంగ నూనెలో యుగెనాల్ మూలకాలు అనేవి ఉంటాయి.
వీటి కారణంగా లవంగం న్యాచురల్ ఎనస్థిటిక్‌గా పనిచేస్తాయి పంటి నొప్పి నుంచి ఉపసమనం కలిగిస్తాయి. ముఖ్యంగాపంటి నొప్పి రాకుండా ఉండాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేయకూడదు. రెండవది పేస్ట్ ఎక్కువగా కాకుండా తగినంత వాడాలి. మార్కెట్‌లో దొరికే సెన్సిటివిటీ టూత్ పేస్ట్‌లు వాడాలి.
Also Read: Cloves: లవంగంతో ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. ఆర్థిక ఇబ్బందులు మాయం అవ్వాల్సిందే?