Health: జలుబుతో బాధపడుతున్నారా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

  • Written By:
  • Publish Date - December 23, 2023 / 06:05 PM IST

Health: కరోనా నేపథ్యంలో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులు వంటివి వచ్చినా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఇన్ ఫ్లుయెంజా తో చాలా మంది బాధపడుతున్నారు. దీంతో ఈ లక్షణాలు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. ప్రజలు అనవసర భయంతో ప్రవర్తించొద్దని చెబుతున్నారు. ఆస్పత్రుల్లో చేరొద్దని సూచిస్తున్నారు. చిన్న పాటి నొప్పులతో ఆస్పత్రుల్లో చేరొద్దంటున్నారు.

మందులు వాడితే సరిపోతుంది. అంతేకాని ఏదో భయపడి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దు. ఏదైనా ఆపద ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా. సరైన నిర్ణయం తీసుకుంటాం. అందుకే ప్రజలు ఊహల్లో తేలాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే చాలా మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అంత భయపడాల్సిన అవసరం లేదు.

చిన్న పాటి రోగాలకు కూడా ఆస్పత్రుల్లో చేరొద్దని చెబుతున్నారు. అంత అవసరమైతే ప్రభుత్వమే ప్రజలకు వైద్యం అందిస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు వాతావవరణ మార్పుల వల్ల చోటుచేసుకోవడం సహజమే. దానికి ఏదో ప్రమాదం జరిగినట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు.