Site icon HashtagU Telugu

Health: బీపీతో బాధపడుతున్నారా.. అయితే బీఅలర్ట్, ఎదురయ్యే సమస్యలు ఇవే

చాలా మందికి తమకు బీపీ (High BP) ఉన్న విషయమే తెలీదు. అయితే, రక్తపోటు ఉన్న వారికి నిద్రలో కొన్ని సమస్యలు ఎదురవుతాయని, ఇవి ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో అధికంగా ఉన్న సోడియం వదిలించుకునే క్రమంలో బీపీ పెరుగుతుంది. సాల్ట్ సెన్సిటివీ ఉన్న వాళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందట. కాబట్టి, బీపీ ఉన్న వాళ్లు ఉప్పు వినియోగం కాస్త తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు నియంత్రణలో లేకపోతే కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

రాత్రుళ్లు తరచూ తలనొప్పి వేధిస్తుంటే కూడా డాక్టర్లను సంప్రదించాలి. సాధారణంగా బీపీ ఉన్న వాళ్లల్లో రాత్రుళ్లు తలనొప్పి మొదలై తెల్లవారుజామున గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందట.  నిద్రలో అతిగా గురక (Snoring) పెట్టడం హైబీపీకి ఓ సంకేతం. ముఖ్యంగా మధ్యవయసుకు చేరుకున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొందరికి పగటి పూట బీపీ లేకపోయినా రాత్రిళ్లు రక్తపోటు పెరుగుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని అంటున్నారు.

బీపీ ఉన్న వాళ్లు సరిగా నిద్రపట్టక కూడా బాధపడతారు. అధిక రక్తపోటు కారణంగా తలనొప్పి, ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి తలెత్తి రాత్రుళ్లు నిద్రపట్టదు. కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Exit mobile version