Site icon HashtagU Telugu

Asthma: ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో శాశ్వత పరిష్కారం!

Asthma

Asthma

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో ఆస్తమా సమస్య కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొందరు ఈ సమస్యను ఏమి కాదులే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆస్తమా సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు మీదికి వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం వేల రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పనిలేదని, కేవలం ఇంట్లో లభించే కొన్ని రకాల చిట్కాలను ఉపయోగిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు.

ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో మిరియాలు లవంగాలు ఒకటి. ఈ మిరియాలు లవంగాలు ఉపయోగించి ఆస్తమా సమస్యకు చెక్ పెట్టవచ్చట. అయితే అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఆరు లేదా ఏడు మిర్యాల గింజలు, ఐదు లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తో ఐదు తులసి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలట. ఆ మొత్తం నీరు బాగా మరిగి సగం గ్లాసు నీరు అయ్యే వరకు బాగా మరిగించాలట.

ఆ తర్వాత వాటిని కొద్దిగా చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరొక గ్లాసులోకి వడపోసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగాలట. ఇలా ప్రతిరోజు ఉదయం ఈ నీటిని తాగటం వల్ల ఆస్తమా సమస్య నుండి క్రమంగా విముక్తి పొందవచ్చని, ఈ నీటిని తాగటం వల్ల ఇతర శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ మీరు కూడా పైన చెప్పిన చిట్కా ఫాలో అయ్యే వారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.