Site icon HashtagU Telugu

Asthma Recovery: ఆస్తమాతో బాధపడుతున్నారా..? ఇవి తింటే తగ్గిపోతుంది ఆస్తమాతో బాధపడేవారు ఎలాంటి పండ్లు తినాలంటే..?

Add A Little Bit Of Body Text 1 1024x910

Add A Little Bit Of Body Text 1 1024x910

Asthma Recovery: దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. ఒకసారి ఆస్తమా వచ్చిందంటే.. దానిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ ఆస్తమా తగ్గదు. ఆస్తమా వచ్చినవారికి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఊపిరి సరిగ్గా ఆడక ఇబ్బంది పడతారు. గాలి చాలా గట్టిగా పీల్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆస్తమాకు చికిత్స ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను తగ్గించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఆస్తమా లాంటి కొన్ని శ్వాసకోస సమస్య వ్యాధులు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా ఉన్నవాళ్లు డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతున్నారు. నట్స్ లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలామంచి చేస్తాయని చెబుతున్నారు. బాదం, హాజెల్ వంటి నట్స్ వల్ల ఆస్తమా అదుపులోకి వస్తుందని అంటున్నారు. అలాగే బ్రోకలీ, కాలే వంటి వెజిటెబుల్స్ కూడా మంచి చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక సాల్మన్, హెర్రింగ్, ట్యూనా, సార్డినె్ వంటి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడకస్ ఉన్న చేపలను తింటే ఆస్తమా పేషెంట్స్‌కి చాలా మంచిదట.

ఇక ఆస్తమా ఉన్నవారు టమాటాలో తినాలట. టమాటోల్లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుది. దీంతో టామోటోలతో తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల శ్వాసకోస సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫ్యూట్స్ తీసుకోవాలి. సాల్మన్, స్వోర్డ్ ఫిస్, ఫ్యాటీ ఫిస్. పాలగుడ్లు, నారింజ రసం వంటివి తీసుకోవాలట. విటమిన్ డి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయాలు, పదార్ధాలు తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

అయితే కొన్ని పండ్లు, కూరగాయాలు ఆస్తమా రోగులకు పడకపోవచ్చు. దీంతో డాక్టర్లను సంప్రదించి తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం ఫుట్స్, కూరగాయలతోనే కాదని, వ్యాయామం లాంటివి చేస్తే అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.