Sleeping : రాత్రి సమయంలో కొంతమంది చీకటిలో, కొంతమంది వెలుతురులో నిద్ర పోవాలని అనుకుంటారు. కొంతమంది భయంతో కూడా లైట్ వేసుకొనే నిద్రపోతారు. అయితే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఎక్కువ కాంతిలో పడుకోకూడదు. ఎక్కువ కాంతి వచ్చే లైట్స్ కాకుండా డిమ్ లైట్స్ వాడితే మంచిది.
ఎక్కువ కాంతిలో నిద్రపోయే వారు ఎక్కువగా మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
రాత్రి నిద్ర పోయే ముందు ఎక్కువ సేపు ఫోన్ చూడడం, ఎక్కువ సేపు టీవీ చూడడం వలన ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎవరైతే లైట్స్ వేసుకొని నిద్ర పోవాలని అనుకుంటారో వారికి అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు.
రాత్రి పూట నిద్ర పోయేముందు పాదాలు తిమ్మిరెక్కడం, సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు లైట్ ఆఫ్ చేసి నిద్రపోవడం మంచిది.
లైట్ ఆఫ్ చేసి ఎక్కువసేపు నిద్ర పోతే మన ఆరోగ్యానికి మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
లైట్స్ వేసుకోవాలని అనుకుంటే డిమ్ లైట్స్ అంటే తక్కువ కాంతి ఉన్న లైట్స్ వేసుకోవడం మంచిది. దానికి ఎరుపు రంగు లైట్స్ వాడడం మంచిది. తెలుపు, నీలం రంగు లైట్స్ వాడకూడదు. ఎరుపు రంగు లైట్ వేసుకుంటే అది మన మెదడును ఉతేజపరుస్తుంది. కాబట్టి ఎక్కువగా మనం రాత్రి సమయంలో నిద్ర పోయేటప్పుడు లైట్ వేసుకోకుండానే నిద్ర పోవడం మంచిది.