మామూలుగా చాలామందికి పడుకునేటప్పుడు రాత్రిపూట దుప్పటి కప్పుకునే అలవాటు ఉంటుంది. చలికాలంలో తప్పనిసరిగా దుప్పటి కప్పుకోవాల్సిందే. ఇంకొందరు దోమల బెడద తట్టుకోలేక దుప్పటి కప్పుకుంటూ ఉంటారు. అయితే దుప్పటి కప్పుకోవడం మంచిదే కానీ కొంతమంది పూర్తిగా ముఖం కూడా కవర్ అయ్యే విధంగా ఊపిరి ఆడకుండా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటారు. అయితే ఇలా పడుకోవడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఇలా పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో చాలా మంది చలి నుంచి తప్పించుకోవడానికి ముఖంపై నుంచి దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు.
పైగా మన నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సయిడ్ మళ్ళీ అక్కడే సర్క్యులేట్ అవుతుంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణను సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది మనం తినే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వాలన్నా, జీర్ణక్రియ సరిగ్గా పని చేయాలన్నా కచ్చితంగా ఆక్సిజన్ అనేది అవసరం. కాబట్టి సరైన ఆక్సిజన్ శరీరానికి అందకపోతే జీర్ణవ్యవస్థపై కచ్చితంగా భారం పడుతుంది. అయితే చలికాలంలో చలిస్తుందని మీరు దుప్పటి కప్పుకొని పడుకుంటే మీ జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. క్రమంగా మీ ఆహరం సరిగ్గా జీర్ణ కాకపోవడం జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతాయి. ఊపిరితిత్తులపై ప్రభావం మన శరీరానికి ఆక్సిజన్ చాలా ముఖ్యం. మనం ఊపిరితిత్తుల ద్వారా గాలి పీల్చుకొని వదిలేస్తుంటాం. అయితే ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకున్నప్పుడు మనకు, మన ఊపిరితిత్తులకు సరిపడా గాలి లేదా ఆక్సిజన్ అనేది అందదు.
దీని కారణంగా ఊపిరితిత్తులు సంకోచించిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గుండెకు తగినంత ఆక్సిజన్ అందక గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చలికాలంలో ముఖం కప్పుకోకుండా పడుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దుప్పటిలోనే ఉండిపోయే చెడు గాలి చర్మాన్ని పాడు చేస్తుందట. చర్మం నలుపు రంగులోకి మారేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఇది చర్మంపై దద్దుర్లు కూడా వచ్చేలా చేస్తుందట. అలాగే ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉండే వ్యక్తులు ఎప్పుడూ ముఖంపై దుప్పటి కప్పుకొని పడుకోకూడదని చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందట. అలాగే ఆస్తమా ఉన్న రోగులు కూడా దుప్పటి కప్పుకొని పడుకోవడం వలన సరైన గాలి ఆడక మరణించే ప్రమాదం ఉంటుందట. అందుకే దుప్పటి కప్పుకొని పడుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.