Peanuts : మీరు మీ ఆహారంలో వేరుశెనగను తినడం మానేస్తున్నారా?

మనం ఏం తినాలి?, ఏం తినకూడదు? అనే అంశంపై క్లారిటీతో ఉండాలి. దీనికో సింపుల్ ఫార్ములా ఉంది.

మనం ఏం తినాలి?, ఏం తినకూడదు? అనే అంశంపై క్లారిటీతో ఉండాలి. దీనికో సింపుల్ ఫార్ములా ఉంది. కొలెస్ట్రాల్ తయారయ్యే అహారాలను తక్కువ తినాలి. కొలెస్ట్రాల్ తయారవ్వని ఆహారాలను ఎక్కువ తినాలి. మైదా, పామాయిల్ వంటి వాటితో కొలెస్ట్రాల్ తయారవుతుంది కాబట్టి వాటిని తగ్గించేయాలి. వేరుశనగ (Peanuts) వంటి వాటితో కొలెస్ట్రాల్ తయారవ్వదు కాబట్టి.. వీటిని ఎక్కువ తినవచ్చు.

వేరుశనగ (Peanuts) నిజాలు తెలుసుకుందాం:

వేరుశనగల్ని ఉడకబెట్టుకొని, వేపుకొని, పచ్చిగా ఎలాగైనా తినవచ్చు. ఇవి శరీరంలో మంచి కొవ్వును పెంచి.. చలి నుంచి కాపాడతాయి. చాలా మంది వేరుశనగలు తినేందుకు భయపడతారు. వాటిలో నూనె ఉంటుందనీ.. బరువు పెరిగిపోతామనీ అనుకుంటారు. కానీ రోజూ గుప్పెడు తింటే ఏమీ కాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగ గింజల్లో కేలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఫైబర్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, మెగ్నీషియం మొదలైన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ప్రమాదం. వేరుశనగల (Peanuts) వల్ల కొలెస్ట్రాల్ రాదు. అందువల్ల వీటిని తినడం మంచిదే. వీటిలో ప్రొటీన్లు, పీచు (Fiber) పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల.. కొన్ని గింజలు తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అది చాలాసేపు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మరింత ఆహారం తీసుకోరు. తద్వారా బరువు పెరగరు. జంక్ ఫుడ్ కంటే వేరుశెనగ వంటి గింజల్ని మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి చాలా రకాలుగా ప్రయోజనాలు కలిగిస్తాయి.

వేరుశెనగలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర వేడిని పెంచి.. చెడు కొవ్వును కరిగించి.. బరువు తగ్గేలా చేస్తుంది. రోజూ వేరుశెనగల్ని తీసుకుంటే కండరాలు దృఢంగా ఉంటాయి. వేరుశెనగ కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వేరుశెనగలోని జింక్, స్పష్టమైన దృష్టికి అవసరమైన విటమిన్ A ని శరీరం పొందేలా చేస్తుంది. ఇందులోని విటమిన్ E కంటిశుక్లం, వయసు పెరిగేటప్పుడు వచ్చే మచ్చల నుంచి రక్షిస్తుంది. వేరుశెనగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ విషయం చాలా అధ్యయనాల్లో రుజువైంది. వేరుశెనగలో మెగ్నీషియం, కాపర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అవసరం. వేరుశెనగలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ధమనుల లోపలి పొరలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గితే.. గుండెకు మంచిది. వేరుశెనగ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో వచ్చే డ్రై స్కిన్ సమస్య కూడా దూరమవుతుంది. మీరు చర్మానికి వేరుశెనగ నూనెను కూడా రాసుకోవచ్చు. ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చర్మంలోని మచ్చలను తగ్గిస్తాయి. ముడతలు, ఫైన్ లైన్‌లు, డార్క్ స్పాట్‌లను తొలగిస్తాయి. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యల్ని ఈ గింజలు నయం చేస్తాయి.

Also Read:  PAN Card : మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయలేదా?