Site icon HashtagU Telugu

Health Tips: గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!

Health Tips

Health Tips

ఇటీవల కాలంలో కంపెనీలు ఎక్కువగా వర్క్ ఫ్రం హోం జాబులు ఇస్తున్నారు. ఇలాంటి జాబ్స్ కి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కంటిన్యూగా ఇలా ఒకే చోట గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చాలామంది ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ కార్యాల‌యంలో కూర్చ‌ని ప‌నిచేస్తుంటారు. లేదంటే ఇంట్లో కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్‌ ల‌తో గంట‌ల‌ త‌ర‌బ‌డి కుస్తీలు పడుతూ ఉంటారు. అయితే, ఒక‌చోటు అలా కూర్చుని ప‌నిచేయ‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ అవ్వ‌క డీప్‌ వీన్‌ త్రొంబోసిస్ అనే వ్యాధికి గుర‌వుతార‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. డీవీటీ వంటి పెను ఆరోగ్య సమస్యతో పాటు ఇంకా అనేక ర‌కాల వ్యాధులకు గుర‌వుతార‌ని వైద్యులు అంటున్నారు.

రక్తపోటు, వెన్నెముక, కీళ్ల నొప్పులు, మానసిక కుంగుబాటు, మధుమేహం, ఆందోళన, మెటబలైజ్‌ ఫ్యాట్‌ తదితర సమస్యలు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలా గంటల తరబడి పని చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎంత పని ఉన్నా కూడా రోజులు కనీసం 40 నిమిషాలు అయినా వ్యాయామం తప్పకుండా చేయాలని చెబుతున్నారు. ఉదయం లేదా సాయంత్రం అలా నడవడం మంచిదని చెబుతున్నారు. రోజులో గంట‌ల‌ త‌ర‌బ‌డి ఒకే ద‌గ్గ‌ర కూర్చుని ప‌ని చేయడం వ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాలంటే వ్యాయ‌మ‌మే దానికి స‌రైన మార్గ‌మ‌ని సూచిస్తున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి క‌దల‌కుండా కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయ‌ట. ఒకరోజులో గంట‌ల‌త‌ర‌బ‌డి కూర్చుని ఉండడం వ‌ల్ల కదలికలు లేక‌ కాళ్లలో రక్తం, ద్రావకాలు ఒకేచోట చేరడం వల్ల గుండె జబ్బులు వ‌చ్చే అవకాశాలు అధికంగా ఉంటాయట.

ఇది రక్త ప్రసారనలో మార్పులకు కూడా కారణ‌మ‌వుతుంది దీంతో అధిక రక్తపోటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల మధుమేహ సమస్యలు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయట. గంటల త‌ర‌బ‌డి కూర్చొవ‌డం వ‌ల్ల కొన్నిరకాల కేన్సర్‌ లకు కూడా కారణం అవుతారని చెబుతున్నారు. మానసిక ఒత్తిళ్లు పెరగడంతో పాటు ఆందోళనలు, చిరాకు వంటివి కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఎక్కువ సేపు కూర్చుకుండా మధ్య మధ్యలో లేచి నిల్చోవాలి. కొంత దూరం అటు ఇటు నడవాల్సి ఉంటుంది. చేస్తున్న పని నుంచి కొంతసేపు విరామం తీసుకోవాలి. కూర్చునే పనిచేయకుండా కాసేపు వీలును బట్టి నిల్చోవాలి.