Site icon HashtagU Telugu

Piles Precautions: పైల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతులు?

Mixcollage 25 Dec 2023 07 03 Pm 8705

Mixcollage 25 Dec 2023 07 03 Pm 8705

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి ఫిబ్రవరి వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మలబద్ధకం పైల్స్ సమస్య కూడా ఒకటి. రోజురోజుకి ఈ ఫైల్స్ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పైల్స్ సమస్య ఉంటే మల ద్వారం లోపల, వెలుపల వాపు సమస్యలు వస్తాయి. అలాగే ఆ ప్రాంతం అంతా మంటగా అనిపించడంతోపాటు మలవిసర్జన సరిగా జరగక చాలా నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ మలబద్ధకం రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మన ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు.

అయితే ఇలాంటి సమస్యలతో బాధ పడేవారు ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని ఫాలో అయితే ఈ సమస్య కాస్త అదుపులోకి వస్తుంది. మరి పైల్స్ ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పైల్స్ ఉన్న వారు మీ డైట్ లో ఖచ్చితంగా ఫ్రెష్ పండ్లు, వెజిటేబుల్స్ తీసుకోవాలి. దీంతో పాటు నీటికి కూడా అధికంగా తాగుతూ ఉండాలి. పైల్స్ ఉన్న వారు మీ డైట్ లో ఖచ్చితంగా ఫ్రెష్ పండ్లు, వెజిటేబుల్స్ తీసుకోవాలి. దీంతో పాటు నీటికి కూడా అధికంగా తాగుతూ ఉండాలి. అదే విధంగా పైల్స్ తో ఇబ్బంది పడేవారు తప్పకుండా ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ ని తీసుకోవాలి.

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. దీని వల్ల పైల్స్ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. అలాగే తేలికైనా, వదులైన దుస్తులు ధరించాలి. అలాగే ఈ పైల్స్ సమస్య ఉన్నవారు వీలైనంతవరకు కారం మసాలా వంటకాలకు దూరంగా ఉండాలి. ఆ సమస్య మరింత ఎక్కువ అయ్యి మలవిసర్జన జరిగినప్పుడు చాలా మంటగా నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ఈ ఫైల్స్ సమస్య మరింత ఎక్కువగా ఉండి చాలా ఇబ్బంది పెడుతుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది..