Site icon HashtagU Telugu

Oily Skin: జిడ్డు చర్మం వల్ల ఫీల్ అవుతున్నారా..ఝ ఇలా చేస్తే తొలగిపోతుంది

Whatsapp Image 2023 05 07 At 16.13.35

Whatsapp Image 2023 05 07 At 16.13.35

Oily Skin: చాలామంది మొఖం జిడ్డు జిడ్డుగా ఉంటుంది. చర్మం పట్టుకుంటే ఎప్పుడూ జిడ్డుగా ఉంటుంది. స్నానం చేసినా కూడా మొఖం జిడ్డుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇక జిడ్డు చర్మం ఉన్నవారికి చెమట చిన్నగా పట్టినా చిరాకుగా అనిపిస్తుంది. దీని వల్ల మొఖం కూడా ప్రకాశవంతంగా కనిపించదు. ఇలా జిడ్డు చర్మంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో జిడ్డు చర్మంను దూరం చేసుకోవచ్చు.

జిడ్డు కారణంగా మెటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జిడ్డు చర్మం నుంచి బయటపడటానికి పెరుగు బాగా పనిచేస్తుందట. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి డెడ్ సెల్స్ ను తొలగిస్తాయి. ఇందుకోసం ఒక కప్పు పెరుగులో రెండు చెంచాల కాఫీ పొడి, ఒక చెంచా పసుపు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి మొఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలిజ ఆ తర్వాత మొఖాన్ని నీళ్లలో శుభ్రం చేసుకుంటే మొఖం కాంతివంతంగా మెరుస్తుంది.

వారానికి రెండు లేదా మూడుసార్లు పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే కొద్దిరోజుల్లోనే జిడ్డు సమస్య పోతుంది. ఇక అరటిపండుతో కూడా ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. బాగా పండిన అరటిపండును గుజ్జుల చేసి రెండు చెంచాల ఓ్స్, చెంచా పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. దానికి మొఖానికి పూసుకుని 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేసినా జిడ్డు చర్మం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇక బొప్పాయి ఫేస్ ప్యాక్ ద్వారా జిడ్డు చర్మం సమస్య తగ్గిపోతుంది.

బొప్పాయి గుజ్జులో కొంచెం తేనె కలుపుకుని ముఖానిక ప్యాక్ లా వేసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకుంటే ముఖం మెరుస్తుంది.

Exit mobile version