Site icon HashtagU Telugu

Bed Bugs : బెడ్ బగ్స్ వేధిస్తున్నాయా ? ఇలా తరిమికొట్టండి

Bed Bugs Vs Paris

Bed Bugs Vs Paris

Bed Bugs : మీ ఇంట్లో.. మీ బెడ్స్‌పై బెడ్ బగ్స్ ఉన్నాయా ? అవి మీకు నిద్రలేకుండా చేస్తున్నాయా ? వాటితో నిత్యం సతమతం అవుతున్నారా ?  అయితే మీరు అలర్ట్ కావాలి. వాటిని తరిమికొట్టే ప్లాన్ రెడీ చేయాలి. లేదంటే బెడ్ బగ్స్  రాత్రంతా  సైలెంటుగా మీ రక్తాన్ని తాగేస్తాయి.  ఉదయం కాగానే మీ మంచం మూలల్లో దాక్కుంటాయి. బెడ్ బగ్స్ కుడితే చెవుల కింద, శరీరంలోని ఇతర భాగాలలోని మృదువైన చర్మం దెబ్బతింటుంది. ఆ చర్మ భాగాల్లో ముడతలు ఏర్పడుతాయి. ఈక్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

We’re now on WhatsApp. Click to Join

వేడినీళ్లు

నీటిని మరిగించి.. మంచంలో బెడ్ బెగ్స్ ఉన్న ప్రదేశంలో ఆ వేడివేడి నీటిని వేయాలి.  ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. తద్వారా క్రమంగా బెడ్ బగ్స్(Bed Bugs) సంఖ్య తగ్గిపోతుంది.

నిమ్మరసం

నిమ్మరసం చాలా పవర్ ఫుల్. ఇది బెడ్ బగ్స్‌పై బాగా పనిచేస్తుంది. కొద్దిగా నిమ్మరసం తీసి, నీటిలో కలిపి ఒక గ్లాసులోకి తీసుకొని మంచం అంచుల్లో వేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే  బెడ్ బగ్స్ క్రమంగా తగ్గుతాయి.

వెల్లుల్లి పేస్టు

వెల్లుల్లిని తొలుత పేస్టులా చేసుకోవాలి.  పేస్టులా రుబ్బడానికి ముందు.. వెల్లుల్లి రెమ్మలు తీసేయాలి. మంచంలో బెడ్‌బగ్స్ ఉన్న చోట ఈ వెల్లుల్లి పేస్టును పూయాలి. ఇలా చేస్తే వారంలోనే బెడ్ బగ్స్ పరార్ అవుతాయి.

Also Read :Project Astra : ఇంట్లో పోగొట్టుకున్న వస్తువులను కనిపెట్టే ఏఐ ఫీచర్

  • స్ప్రే బాటిల్‌లో నీరు, లవంగాలను నింపి.. బాగా షేక్ చేసి.. బెడ్ బగ్స్ ఉన్నచోట స్ప్రే చేయాలి.
  • టీ ట్రీ ఆయిల్‌లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. దీన్ని నీటిలో కలిపి బెడ్ బగ్స్ ఉన్నచోట స్ప్రే చేయాలి.
  • పుదీనా ఆకులు .. కీటక వికర్షకాలు. వీటిని పిండుకొని మంచం, దిండు కింద ఉంచితే బెడ్ బగ్స్ బెడద తగ్గుతుంది.
  • లావెండర్ ఆయిల్ సువాసనకు బెడ్ బగ్స్ చనిపోతాయి. దీన్ని నీటిలో కలిపి క్రిములు ఎక్కువగా ఉన్న చోట పిచికారీ చేయాలి.
  • బేకింగ్ సోడాను నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి బెడ్ బగ్స్ ఉన్నచోట పిచికారీ చేయాలి.
  • లెమన్ గ్రాస్.. బెడ్ బగ్స్‌ను, వాటి గుడ్లను నాశనం చేయగలదు.