Gut health : మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ ప్రేగులలోని జీర్ణవ్యవస్థ (గట్ హెల్త్)లో ఏదో సమస్య ఉన్నట్లు. మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల వలన ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. విషపూరిత వాయువులను ప్రేగులు గ్రహించడంవల్ల అవి రక్తంలో కలిసి, కాలేయం, మూత్రపిండాలు, చర్మం వంటి శరీరంలోని భాగాలకు చేరుతాయి. విషవాయువులను శరీరం నుండి బయటకు పంపేంత శక్తి కాలేయం, మూత్రపిండాలకు లేనప్పుడు, అవి శరీరంలోనే పేరుకుపోయి, విషపదార్థాల స్థాయిలను పెంచుతాయి.తద్వారా శీరీరంలో ఒక్కో అవయవం మీద ఒత్తిడి పెరుగుతుంది. అవి పనిచేసినంత వరకు ఓకే. ఎప్పుడైతే అవి చేతులు ఎత్తేస్తాయో మనిషి అనారోగ్య సమస్యల బారిన పడతాడు. ఒక్కోటిగా తీవ్ర రూపం దాలుస్తాయి. ఇక మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, అసిడిటీలవల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయి.
ప్రేగులలోని ఆరోగ్యం (గట్ హెల్త్)
మన ప్రేగులలో మంచి చెడు బాక్టీరియాలు రెండూ ఉంటాయి. సమతుల్యంగా ఉన్నప్పుడు, అవి ఆహారాన్ని జీర్ణం చేసి, పోషకాలను శరీరం గ్రహించేలా సహాయపడతాయి. సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, హానికరమైన బాక్టీరియా పెరిగి, టాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ టాక్సిన్లు రక్తప్రవాహంలో కలిసి, విషవాయువులను విడుదల చేసి, శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తాయి. తద్వారా అవి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. తరచూ జ్వరాలు రావడం, నీరసం అయిపోవడం, రక్తం తగ్గిపోవడం, ఛాతిలో మంట, కడుపులో పుండ్లు, ఇన్ ఫెక్షన్లు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
గట్ హెల్త్ దెబ్బతింటుందా?
అవును, ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలవల్ల ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్యలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే, పెద్ద ప్రేగుల నుండి విషవాయువులను చిన్న ప్రేగులు గ్రహించి, వాటిని రక్తంలో కలవకుండా అడ్డుకునే రక్షణ కవచం దెబ్బతింటుంది. దీంతో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయ్యే చాన్స్ ఉంది.
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్
గ్యాస్, అజీర్తి పెరుగుతాయా?
అవును, ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటే గ్యాస్, అజీర్తి పెరుగుతాయి. ప్రేగులలో పేరుకుపోయిన వ్యర్థాలు, సరిగా జీర్ణం కాని ఆహారం కుళ్ళిపోవటంవల్ల విషవాయువులు, గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల, అజీర్తి, ఎసిడిటీ, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
శరీరంలో విషవాయువులు పెరుగుతున్నట్లు తెలుసుకోవాలంటే, మనం మొదట గట్ హెల్త్‌ను పరీక్షించాలి. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, ఛాతీలో మంట వంటి సమస్యలు ఉంటే, మీ ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటుందని అర్థం. ప్రేగుల ఆరోగ్యం మెరుగుపడాలంటే మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. వాకింగ్ చేయాలి.. గోరువెచ్చని నీరు తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. నిద్ర సరిగా పోవాలి. అప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలితో, మనం విషవాయువుల నుండి శరీరానికి రక్షణ ఇవ్వగలం.
Minister Post : మాట మార్చిన రాజగోపాల్..మంత్రి పదవి అవసరమే లేదు