Tamarind : చింతపండు ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త.?

చింతపండు (Tamarind) మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 06:20 PM IST

Eating too much Tamarind : మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో చింతపండు తప్పనిసరిగా ఉంటుంది. పప్పు, రసం, చట్నీ సాంబార్ ఇలా ఎన్నో రకాల వంటల్లో ఈ చింతపండును ఉపయోగిస్తూ ఉంటారు. ఇక చింతపండు (Tamarind) మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చింతపండును అతిగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట. చింతపండు (Tamarind) తింటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

చింతపండు (Tamarind) తీయగా పుల్లగా ఉండడం వలన దంతాల సమస్యకు కారణం అవుతుంది. దంతాల సమస్య ఉన్నవారు చింతపండును ఎక్కువగా తింటే ఆ నొప్పి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమ బహిష్టు సమయంలో చింతపండు (Tamarind)ను అస్సలు తినకూడదు. బహిష్టు సమయంలో చింతపండును గానీ, చింతపండుతో చేసిన రసాలను గానీ తిన్నా, తాగినా కడుపునొప్పి మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ సమయంలో చింతపండుతో చేసిన పదార్థాలను తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో చింతపండు తినడం వల్ల కడుపు నొప్పి సమస్యకు దారితీస్తుంది.

అజీర్తి, అసిడిటి సమస్యను పెంచుతుంది. అలాగే చింతపండును మితంగా మాత్రేమే తినాలి. చింతపండులో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన కడుపులో గ్యాస్ సమస్యలు తయారవుతాయి. కాబట్టి పరిగడుపున చింతపండు అసలు తీసుకోకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు చింతపండు తీసుకోకుండా ఉండడం మంచిది. లేదంటే గ్యాస్ అమాంతం పెరిగి ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. ఇక దంత సమస్యలు ఉన్నవారు కూడా చింతపండును తీసుకోకుండా ఉండడం మంచిది.

Also Read:  30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్