Salt : రక్థ పోటు లేకున్నా ఉప్పు ఎక్కువగా తింటున్నారా..!

అధిక రక్తపోటు తలెత్తటానికి ముందే ఉప్పుతో (Salt) రక్తనాళాలు దెబ్బతింటున్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యుడు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Are You Eating Too Much Salt Even If You Don't Have High Blood Pressure!

Are You Eating Too Much Salt Even If You Don't Have High Blood Pressure!

Eating too Much of Salt : అధిక రక్తపోటుతో గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుందనే అందరికి తెలిసిందే. అయితే రక్తపోటు మామూలుగా ఉన్నా ఉప్పు ఎక్కువగా తినేవారికి గుండె, మెదడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధిక రక్తపోటు తలెత్తటానికి ముందే ఉప్పుతో (Salt) రక్తనాళాలు దెబ్బతింటున్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యుడు చెబుతున్నారు. ఉప్పుతో రక్తపోటు ఎక్కువగా పెరుగుతుంది. ఇది గుండెకు తెలియనంత చేటు చేస్తుంది. కానీ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటంలో ఉప్పు పాత్ర గురించి పెద్దగా తెలియదు. అందుకే స్వీడన్‌ పరిశోధకులు తొలిసారిగా అధిక ఉప్పు (Salt) వాడకం, రక్తనాళాల్లో పూడికల మీద అధ్యయనం చేశారు.

ఈ రెండింటి మధ్య సంబంధం ఉండటమే కాదు.. ఉప్పు (Salt) ఎంత ఎక్కువగా తింటే పూడికల ముప్పు అంత ఎక్కువగా పెరుగుతున్నట్టూ వారు గుర్తించారు. అధిక రక్తపోటు లేకపోయినా ఉప్పు అధికంగా వాడే వారిలో పూడికల ఆనవాళ్లు కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం. అందుకే ఉప్పు విషయంలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు గలవారే కాదు.. మిగతావారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నమాట. రోజుకు ఒక చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తినొద్దన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేస్తూ ఉంది. నిజానికి ఎంత ఉప్పు తింటున్నామనేది అంచనా వేసుకోవటం ఎవరికైనా కష్టమే. భోజనం చేసేటప్పుడు విడిగా ఉప్పు వేసుకోకుండా చూసుకున్నా చాలావరకు తగ్గించుకోవచ్చు. ఉప్పుకు బదులు రుచి కోసం నిమ్మకాయ రసం వంటివి వాడుకున్నా ఆరోగ్యానికి మేలే ..

Also Read:  Turmeric : అజీర్ణానికి పసుపుతో కళ్లెం వేయొచ్చా..!

  Last Updated: 30 Sep 2023, 04:32 PM IST