ఉదయాన్నే (Early Morning) చాలామంది వ్యాయామం తో పాటు కొన్ని ఆహార పదార్దాలు తీసుకుంటుంటారు. కానీ వీటిలో కొన్ని పండ్లను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. నిమ్మ, నారింజ మరియు దానిమ్మ వంటి పండ్లను ఉదయాన్నే తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయని చెపుతున్నారు. ఈ పండ్లలో ఎక్కువ ఉత్పత్తి చేసే ఆమ్లాలు (acidic contents) గ్యాస్ అనారోగ్యానికి గురి చేస్తాయని పేర్కొంటున్నారు.
First GBS Death : తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. ఇవి తెలుసుకోండి
అలాగే ఉప్పు, కారం, మసాలా మరియు డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ఉదయాన్నే తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ ఆహారాలు పొట్ట ఉబ్బరాన్ని, అజీర్తిని కలిగించవచ్చు. కాబట్టి ఉదయాన్నే ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉంచడం మంచిది అని చెపుతున్నారు. అలాగే టీ, కాఫీ మరియు తీపి పదార్థాలు , ఐస్క్రీమ్, కూల్డ్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు కూడా ఉదయాన్నే తీసుకోవడం మంచిది కాదు. ఇవి కూడా పొట్టలో గ్యాస్ సమస్యలను పెంచుతాయి, శరీరాన్ని అలసటగా చేసి, జలుబు వంటి వ్యాధులకు దారితీస్తాయి.
అంతే కాకుండా నిల్వ పచ్చళ్లు, చీజ్ వంటి పదార్థాలను కూడా ఉదయాన్నే తీసుకోవడం వల్ల అవి శరీరానికి మంచి శక్తిని అందించవు. ఈ పదార్థాలు శరీరంలో పీచు పెంచుతాయి. వీటిని కేవలం మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవడం మంచిది. ఈ సూచనలను పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.