Empty Stomach: ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా..? అయితే జాగ్రత్త పడండి.

ఉదయాన్నే చాలా మంది ఎన్నో రకాల ఫుడ్స్ తింటారు. కానీ, కొన్ని ఫుడ్స్ పరగడపున తింటే చాలా సమస్యలు వస్తాయట.

Published By: HashtagU Telugu Desk
Are You Eating These On An Empty Stomach But Be Careful.

Are You Eating These On An Empty Stomach But Be Careful.

మీరు రోజుని ఎలా స్టార్ట్ చేస్తారో.. అదే ఎఫెక్ట్ ఆ రోజంతా ఉంటుంది. ఇది మీరు కూడా చాలా సార్లు ఫీల్ అయ్యే ఉంటారు. అందుకే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో (Empty Stomach) తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అజీర్ణం, గ్యాస్ ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి, వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఉదయాన్నే చాలా మంది ఖాళీ కడుపుతో (Empty Stomach) ఎన్నో రకాల ఫుడ్స్ తింటారు. కానీ, కొన్ని ఫుడ్స్ పరగడుపున తింటే చాలా సమస్యలు వస్తాయట. వాటిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కాఫీ, టీ:

చాలా మంది ఉదయాన్నే వేడివేడి పొగలు కక్కే కాఫీ, టీతో స్టార్ట్ చేస్తారు. ఇది తాగేటప్పుడు మాంచి రీఫ్రెష్‌ ఫీల్‌ని ఇస్తుందేమో.. కానీ, ఆ తర్వాత ఇది చాలా సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. అంతే కాకుండా డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. వీటి బదులు మీరు నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. లేదా, రాత్రి పూట నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు టీ, కాఫీ తీసుకుంటే సమస్యలు రావని చెబుతున్నారు నిపుణులు.

కూల్ డ్రింక్స్:

కూల్ డ్రింక్స్‌ని కూడా ఖాళీ కడుపుతో తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల వికారం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీటికి ఎంత దూరం ఉంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

ఐస్ టీ, కోల్డ్ కాఫీ:

ఐస్ టీ, కోల్డ్ కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. వీటిని ఏ సమయంలో తీసుకున్నా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. కానీ, ఖాళీ కడుపుతో మాత్రం తీసుకుంటే మాత్రం కడుపులో శ్లేష్మ పొర దెబ్బతిని జీర్ణ క్రియ మందగిస్తుంది.

పచ్చి కూరగాయలు:

పచ్చి కూరగాయలతో చాలా మంది సలాడ్స్ చేసుకుని తింటారు. దీని వల్ల బరువు తగ్గుతారు. కానీ, ఖాళీ కడుపుతో తింటే మాత్రం జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కడుపునొప్పికి కారణమవుతుంది.

స్పైసీ ఫుడ్:

కొంతమంది ఉదయాన్నే స్పైసీ ఫుడ్ తింటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. సాధారణంగా ఇది మామూలు సమయంలోనే అస్సలు మంచిది కాదు. ఇక ఖాళీ కడుపుతో తింటే లైనింగ్‌లో ఇబ్బంది ఏర్పడి అసిడిటీకి కారణమవుతుంది.

సిట్రస్ ఫ్రూట్స్:

ఖాళీ కడుపుతో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అవుతుంది. వీటిని ఖాళీ కడుపు తినడం వల్ల కడుపులో భారంగా ఉంటుంది. సాధారణంగా ఇవి మంచివే. కానీ, ఖాళీ కడుపుతో తినడం అస్సలు మంచిది కాదని దీని వల్ల కడుపులో సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ఏం తీసుకోవాలంటే..:

ఎప్పుడు కూడా ఖాళీ కడుపుపై ప్రయోగాలు చేయొద్దు. ఈ సమయంలో గోరువెచ్చని నీరు తీసుకుని నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఆరోగ్యానికి అదనపు లాభాలు ఉంటాయి.

Also Read:  Protein Powder: ఇక మీ ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోండి.

  Last Updated: 23 Feb 2023, 09:14 AM IST