Site icon HashtagU Telugu

Winter: మీరు కూడా చలికాలంలో అలాంటి వాటిని తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

Mixcollage 19 Dec 2023 05 34 Pm 2440

Mixcollage 19 Dec 2023 05 34 Pm 2440

మామూలుగా సీజన్లు మారినప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా మారుతూ ఉంటాయి. అలా చలికాలంలో కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి. అలా కాకుండా చాలామంది వాళ్లకు ఇష్టమైన ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. అలా ఏది పడితే అవి తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవడం ఖాయం. అయితే చలికాలంలో చాలామంది ఈ వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అని అనుకుంటూ ఉంటారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను నూనెలో వేయించిన వంటకాలు లేదా వేడివేడి కాఫీ ఇలా తాగాలి,తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి వాటిని తినే ముందు వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్యంగా చలికాలంలో ఆహార పదార్థాల పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ శీతాకాలంలో కొన్ని ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది చలికాలంలోనూ వర్షాకాలంలో శీతల పానీయాలు, ఐస్ క్రీములు చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం బాగా అలవాటు ఉంటుంది. కాబట్టి ప్లూ, జలుబు లాంటి సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. కావున ఇటువంటి పరిస్థితుల్లో ఫిట్ గా ఉండేందుకు ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవాలి. దానికి ఈ చలికాలంలో అతి వేడి అతి చల్లని ఆహార పదార్థాలను ముట్ట కూడదు. సలాడ్లతోపాటు పచ్చి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన శీతాకాలంలో దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలంలో సలాడ్లను తీసుకోకపోవడమే మంచిది. అలాగే శీతాకాలంలో రెడ్ మీట్ తీసుకోకూడదు.

ఎందుకనగా ఈ మాంసంలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి వీటి వలన గొంతులో కఫం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావున ఈ శీతాకాలంలో రెడ్ మీట్ కి దూరంగా ఉండటమే మంచిది. కాగా శీతాకాలంలో పాల ఉత్పత్తులు వాడకానికి దూరంగా ఉండటమే చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వలన మీకు ఇన్ఫెక్షన్స్ తో పాటు చాతిలో కొరకు కారణం అవచ్చు. కాబట్టి చలికాలంలో షేక్స్ స్మూతీసు లాంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే చాలా శ్రేయస్కరం వీటిని తీసుకోవడం వల్ల దగ్గు సమస్య అధికమవుతుంది. అదేవిధంగా జ్యూసులకు దూరంగా ఉండాలి. చలికాలంలో ప్యాక్ చేసిన జ్యూసులను అస్సలు తీసుకోవద్దు. వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యం దెబ్బతింటుంది. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.

Exit mobile version