Pumpkin : చలికాలంలో గుమ్మడికాయ తింటున్నారా…?అయితే ఇది మీకోసమే..!!

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 10:38 AM IST

శీతాకాలం మొదలైందంటే చాలా ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందులో ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ వేధిస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఆంగ్ల మెడిసిన్ ఉపయోగిస్తుంటాం. కానీ ఫలితం మాత్రం అంతంతమాత్రమే ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం కూడా మంచిది కాదని చెబుతుంటారు వైద్యులు. అయితే మనఇంట్లో వస్తువులతో వీటిన్నింటికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా గుమ్మడికాయ. ఇది మనఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్సి, ఫైబర్, కెరోటినాయిడ్స్ జింక్, విటమిన్ డి, ఐరన్,కాపర్ ఇవ్వన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి.

గుమ్మడికాయ రుచి కూడా ఎంతో బాగుంటుంది. దీన్నికూర రూపంలోకానీ జ్యూస్ రూపంలో కానీ తీసుకోవచ్చు. అయితే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటిని బలోపేతంచేస్తుంది. అంతేకాదు సీజనల్ గా వచ్చే వ్యాధులు ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుంచి ఉపశమానాన్ని కలిగిస్తుంది. అధికరక్తపోటు, డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. గుమ్మడిలో కాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.

ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుమ్మడికాయను కొంచెం తిన్నా సరే..కడుపు నిండిపోతుంది. తొందరగా ఆకలి అనిపించదు. బరువు తగ్గేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వారంలో మూడు సార్లు దీన్ని ఆహరంలో తీసుకున్నట్లయితే బరువు తగ్గుతారు. అంతేకాదు జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. మలబద్ధకం సమస్య లేకుండా చేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకం ఉన్నవాళ్లు రాత్రి సమయంలో గుమ్మడికాయ జ్యూస్ కానీ కూర కానీ తినాలి. మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఇది అధిక రక్తపోటుతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంచడంలోకీలక పాత్ర పోషిస్తుంది. బీటా కెరోటిన్ అధిక మొత్తంలో ఉండటం వల్ల కంటి సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి.