Site icon HashtagU Telugu

Prawns: రొయ్యలు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా?

Prawns

Prawns

నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలతో అనేక రకాలైన వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. స్టాటర్స్, స్నాక్స్, బిర్యానీలు, పులుసు,వేపుడు రకరకాలైన కర్రీలు ఇలా ఏది చేసినా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రొయ్యలు తినడం మంచిదే కానీ అలా అని మితిమీరి ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. రొయ్యలు ఎక్కువగా దొరికే ప్రాంతంలో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా రొయ్యలు ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చేపలు లేదా రొయ్యల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే వ్యాధి ఎలర్జీ. ఎలర్జీ వ్యాధి ఉన్నవారు ఈ రొయ్యలను అస్సలు తినకూడదు. అలాగే దగ్గు జలుబు తుమ్ములు ఆయాసం ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ రొయ్యలను తినకపోవడం మంచిదని చెబుతున్నారు. వీటితో పాటుగా ఇస్నోఫీలియా, దురదలు, దద్దుర్లు,బొల్లి మచ్చలు, నల్ల మచ్చలు,కడుపులో నొప్పి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చేపలు తినకూడదట. రొయ్యలు అసలే తినకూడదని చెబుతున్నారు.

అయితే ఈ సమస్యలతో ఇదివరకే బాధపడుతున్న వారు ఏం కాదులే ఏమవుతుంది అని రొయ్యలు తింటే మాత్రం ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయట. కాబట్టి పైన చెప్పిన వ్యాధులు ఉన్నవారు నువ్వు రొయ్యలు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు. రొయ్యలు మలబద్ధకాన్ని కలిగిస్తాయట. అంతేకాకుండా తగ్గిపోయిన పాత నొప్పులను కూడా తెచ్చి పెడతాయని చెబుతున్నారు. అయితే పైన చెప్పిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒకవేళ రొయ్యలను తినాలి అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.