Cancer : పిజ్జాలు, బర్గర్లు తింటున్నారా?మీకు క్యాన్సర్ తప్పదు..శాస్త్రవేత్తల వార్నింగ్..!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 09:57 AM IST

మీరు ఫాస్ట్ ఫుడ్ అతిగా లాగిస్తుంటారా.. అందులో ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు తినలేనిది ఉండలేకపోతున్నారా. అయితే మీకు క్యాన్సర్ గ్యారెంటీ. ఇది మేము చెబుతున్నది కాదు. శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు. పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ 90శాతం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాబట్టి పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించారు.

ఈ వ్యాధి కుటుంబ చరిత్ర, .పెరుగుతున్న వయస్సు, జీవనశైలి కారణంగా ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా తినేవారిలో పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడటం ఖాయమని కొత్త పరిశోధనలో వెల్లడయ్యింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే 29శాతం మంది పురుషుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనలో తేలింది. మహిళ్లలో ఈ వ్యాధి 17శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్
-ఇన్ స్టంట్ నూడుల్స్, సూప్ లు
-ప్యాక్ చేసిన స్నాక్స్
-ఫీజీ కోల్డ్ డ్రింక్స్
-ఇన్ స్టాంట్ ఫుడ్
-కేకులు, బిస్కెట్లు, స్వీట్లు
-పిజ్జా, బర్గర్లు, పాస్తా

ఇవన్నీ కూడా ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లోకి వస్తాయి. ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వాటిలో చాలా కేలరీలు ఉంటాయి. ఇవి తింటే ఆకలి ఉండదు. బరువు పెరుగుతారు. ప్రస్తుతం చాలా మంది వీటిని తినేందుకు అలవాటు పడ్డారు. బ్రేజిల్ లో దాదాపు 23,000మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈఫుడ్ తీసుకునే వారిలో మరణరేటు ఎక్కువగా ఉందని గుర్తించారు.