మటన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మటన్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. చికెన్ తో పోలిస్తే మటన్ లోనే ఎక్కువ లాభాలు ఉంటాయి. మటన్ మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. కాబట్టి ఈ మటన్ తీసుకునేవారు లిమిట్ గా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలుగా బాధపడేవారు మటన్ తక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. మటన్ తినడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందట. అప్పుడు మాత్రమే తినాలని చెబుతున్నారు. ఒకవేళ రాత్రిపూట మటన్ తింటే ఏం జరుగుతుందో, ఇలాంటి సమస్యలు వస్తాయని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాత్రిపూట మటన్ తింటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందట. రాత్రిపూట మటన్ తినడం అది కూడా చాలా లేట్ నైట్ లో మటన్ తినడం మంచిది కాదట. మటన్ జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుందట. రాత్రి పూట మన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. కాబట్టి మటన్ తింటే అది త్వరగా జీర్ణం కాక కడుపులో అసౌకర్యంగా ఉంటుందట. కడుపు ఉబ్బరంగాను, మలబద్ధకం వంటి సమస్యలు రాత్రి పూట మటన్ తింటే వస్తాయట. మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుందట. మటన్ జీర్ణం కాకపోవడం వల్ల మన నిద్రకు కూడా అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు.
ప్రశాంతంగా నిద్రపోకపోతే దాని ప్రభావం మరుసటి రోజు శరీరం పై కనిపిస్తుంది. ఇక మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట కేవలం పడుకుంటాము కాబట్టి ఈ శారీరక శ్రమ ఉండదు కాబట్టి ఈ కొవ్వు శరీరంలో పేరుకుపోయి బరువు పెరిగే అవకాశాలు ఉంటాయట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. రాత్రి మటన్ తింటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట. మటన్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తపోటును పెంచటానికి కారణం అవుతుందట. మటన్ ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ బాధితులుగా మారే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు.