Mangoes: మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

సమ్మర్ సీజన్ అనగానే చాలామంది మామిడి పండ్లు తినేందుకు ఇష్టం చూపుతారు.

  • Written By:
  • Updated On - May 12, 2023 / 11:19 AM IST

సమ్మర్ సీజన్ అనగానే చాలామంది మామిడి పండ్లు తినేందుకు ఇష్టం చూపుతారు. అయితే మామిడి పండ్లు తినేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండ్లలో ఉండే సోడియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు సమ్మర్‌‌లో ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మామిడి పండ్లపైన ఎక్కువగా ఉండే ఫైటిక్ యాసిడ్ వల్ల కొంతమందికి వేడి చేయడం, పొక్కులు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే మామిడి పండ్లను తినేముందు వాటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇలా చేస్తే.. పండు నుంచి ఉత్పత్తి అయ్యే ఫైటిక్ యాసిడ్‌ తొలగిపోతుంది. మామిడి పండ్లను తినడానికి ముందు గంటపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల పంట సమయంలో వాటిపై చల్లే కెమికల్స్ కూడా తొలగిపోతాయి. మామిడి పంట కోసం వాడే ఎరువులు రసాయనాల్లో పాలీఫెనాల్స్, టానిన్లు వంటివి ఉంటాయి. నానబెట్టి తినడం వల్ల అవి తొలగిపోతాయి. మామిడి పండ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే వాటిని తినేముందు కచ్చితంగా కాసేపు నీళ్ళల్లో నానబెట్టాలి. నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి సహజమైన తీపి, సమ్మేళనాలు తిరిగి పొందొచ్చు.

వీటితో పాటు మామిడి పండ్లు తినేముందు అది స‌హజంగా పండినదా లేదా అన్నది తెలుసుకోవడం కోసం పండును నొక్కి చూడాలి. మెత్తగా అనిపిస్తే సహజంగా పండినది అయ్యే అవకాశం ఉంది. అలాగే సహజంగా పండిన మామిడి పండు తొడిమ ద‌గ్గర మంచి వాస‌న వ‌స్తుంది. కార్బైడ్ ఉప‌యోగించి పండించిన పండ్లను తెలుసుకోవడం కోసం నీటిలో వేసి చూడాలి. పైకి తేలితే కార్బైడ్‌తో పండినట్టు. అదే స‌హ‌జంగా పండించిన‌ పండ్లయితే నీటిలో మునుగుతాయి. డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ వాళ్ళు మామిడి పండ్లు తినేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Also Read: Google Bard india Launched : ఇండియాలో రిలీజైన “గూగుల్ బార్డ్”.. వాడటం ఇలా