Site icon HashtagU Telugu

Health Tips: వంకాయ, పాలు కలిపి అస్సలు తీసుకోకూడదా.. తింటే అంత డేంజరా?

Health Tips

Health Tips

వంటింట్లో ఉండే కాయగూరలలో వంకాయ కూడా ఒకటి. వంకాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉండరు. కొంతమంది వంకాయలను ఇష్టంగా తింటే మరికొందరు అస్సలు తినడానికి ఇష్టపడరు. అలర్జీలు వంటి ఉన్నవారు వంకాయలు తినరు. ఇకపోతే పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు తరచుగా తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పాలు అలాగే వంకాయ రెండు ఆరోగ్యానికి మంచి చేసేవి అయినప్పటికీ ఈ రెండు కలిపి తీసుకోవడం అసలు మంచిది కాదని చెబుతున్నారు.

మరి వంకాయ పాలు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వంకాయ, పాలను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం కావచ్చట. వంకాయ పాలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయట. కడుపు ఉబ్బరం, గ్యాస్, తేన్పులు, కడుపులో అసౌకర్యం, కొన్నిసార్లు కడుపు నొప్పి వంటివి రావచ్చని చెబుతున్నారు. భిన్నమైన జీర్ణక్రియ ప్రక్రియల వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు. విరుద్ధాహారం వల్ల ఏర్పడిన ఆమం రక్తంలో కలిసి చర్మానికి చేరినప్పుడు దురద, దద్దుర్లు, ఎగ్జిమా, మొటిమలు వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. వంకాయ, పాల కలయిక కొందరిలో ఇలాంటి చర్మ ప్రతిచర్యలను ప్రేరేపించవచ్చని చెబుతున్నారు.

కాగా కొందరికి వంకాయ పడకపోవచ్చు. మరికొందరికి పాలు పడకపోవచ్చు. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు, అలెర్జీ ప్రతిచర్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందట. తరచుగా ఇలాంటి విరుద్ధ ఆహారాలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడి, జీర్ణశక్తి మందగించే అవకాశం ఉంటుందట. ఇది పోషకాల శోషణను కూడా ప్రభావితం చేయవచ్చట. కొందరిలో జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా ప్రేరేపితం కావచ్చని చెబుతున్నారు. కొన్ని వంటకాల్లో వంకాయతో పాటు పెరుగు లేదా మజ్జిగ వంటివి వాడతారు. పాలతో పోలిస్తే, పులియబెట్టిన పాల ఉత్పత్తులు జీర్ణక్రియకు కొంచెం సులువుగా ఉండవచ్చట. అదేవిధంగా వంకాయ కూర తిన్న వెంటనే పాలు తాగడం లేదా పాలతో చేసిన స్వీట్లు తినడం వంటివి చేయకపోవడం మంచిదని చెబుతున్నారు. రెండు ఆహారాల మధ్య కనీసం కొంత సమయం వ్యవధి ఉండేలా చూసుకోవాలట. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, అలెర్జీలు ఉన్నవారు ఈ కలయికకు దూరంగా ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు.