చాలామంది ఉదయం నిద్ర లేవగానే కాఫీ టీలు తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది వెయిట్ లాస్ అవ్వడం కోసం హనీ వాటర్, లెమన్ వాటర్ వంటివి తాగుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హనీ వాటర్ ఎక్కువగా తాగుతున్నారు. ఈ హనీ వాటర్ వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని తాగుతూ ఉంటారు. దీనివల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతో పాటు అతి బరువు సమస్య, డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్, ఫ్లూ లక్షణాల నుంచి తొందరగా బయటపడవచ్చని చెబుతున్నారు.
కాగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె అలాగే నిమ్మరసం కలుపుకొని తాగితే ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుందట. శరీర బరువు తగ్గి ఉబకాయ సమస్యకు స్వస్తి పలకవచ్చని చెబుతున్నారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే తేనె నిమ్మరసం నీటిలో వేసి బాగా మరిగించి లెమన్ టీ అంటూ తాగుతుంటారు. దీనివల్ల మీకు ఎలాంటి అంటే ఆరోగ్య ప్రయోజనాలు లభించవట. తేనెను నీటిలో మరిగించడం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు నశించిపోతాయట. కాబట్టి తేనె పానీయాన్ని సేవించాలనుకుంటే గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.
అలాగే మలబద్ధకం గ్యాస్ట్రిక్ అజీర్తి ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని సేవిస్తే కడుపులో ఉండే చెడు మలినాలు తొలగిపోయి పేగు కదలికలు మెరుగుపడతాయట. ఇక వేసవికాలంలో శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఎంతో దోహదపడుతుందని, అయితే ఈ హనీ వాటర్ ఆరోగ్యానికి మంచిది కదా అని ఆహారం కూడా మానేసి రోజంతా ఇదే తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు. రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవట.