Site icon HashtagU Telugu

Green Tea : రోజు గ్రీన్ టీ తాగుతున్నారా? ఇది మీకోసమే..!

Green Tea Recipe

Green Tea Recipe

చాయ్‌, కాఫీ తాగేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో గ్రీన్‌ టీకి (Green Tea) అలవాటు పడుతున్నారు. ఆఫీసుల్లో, ఇండ్లలో గ్రీన్‌ టీ (Green Tea) తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్‌ టీకి భలే డిమాండ్‌ వచ్చింది. గ్రీన్‌ టీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్యాటెచిన్స్‌ వంటి బయోయాక్టీవ్‌ పాలిఫెనాల్స్‌ చాలా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిండెట్లే. ఇవి ఫ్రీరాడికల్స్ డ్యామేజీని అరికడతాయి. అయితే, గ్రీన్‌ టీతో ప్రయోజనాలు ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు, లెక్క లేకుండా తాగడం కూడా అంత మంచిది కాదు ..

ఎలా తాగాలి?

వేడి నీటిలో డైరెక్ట్‌గా గ్రీన్‌ టీ కలపొద్దు. ఇలా చేయడం వల్ల దానిలోని కాటెచిన్స్‌ నాశనమవుతాయి. నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతనే గ్రీన్‌ టీ కలపాలి. డికాఫినేషన్‌ ప్రక్రియ కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల దానిలోని ఆరోగ్యకరమైన పోషకాలు నశించిపోతాయి. గ్రీన్‌ టీలో నిమ్మరసం కలుపుకొని తాగడం చాలా మంచిది.

ఎంత తాగాలి?

గ్రీన్‌ టీ ఆరోగ్యకరమని ఎక్కువ తాగకూడదు. రోజులో సగటున 3 కప్పులకు మించకూడదు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలతోపాటు ఆరోగ్యానికి
ఆందోళన కలిగిస్తుంది.

ఎప్పుడు తాగకూడదు?

చాలా మంది గ్రీన్ టీని ఉదయం పూట తాగుతున్నారు. ఇలా తాగడం ఎంత మాత్రమూ మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణం వ్యవస్థ చెడిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసిన తర్వాత ఉదయం 11 – 12 గంటల మధ్య, భోజనానికి గంట ముందు, సాయంత్రం అల్పాహారం తర్వాత గ్రీన్‌ టీ తాగకూడదు. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది కాదు

Also Read:  Double Decker E-Buses : హైదరాబాద్ కు మళ్ళీ డెక్కర్‌ ఈ – బస్సులు!