Site icon HashtagU Telugu

Coconut Water: ఏంటి కొబ్బరి బొండం తాగితే అలాంటి సమస్యలు వస్తాయా.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Coconut Water

Coconut Water

వేసవికాలంలో చాలా మంది న్యాచురల్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. నాచురల్ డ్రింక్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరినీళ్లు. ఈ కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఎండాకాలంలో వచ్చి చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ కొబ్బరినీళ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటిని తరచుగా తాగడం వల్ల అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే కొబ్బరి బోండం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదండోయ్ ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

ఏంటి కొబ్బరి బోండం తాగితే సమస్యలు వస్తాయా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నీటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుందట. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు. ఇందులోని పొటాషియం కారణంగా ఆ సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయట.

కొబ్బరి నీటికి కొంత మందికి అలెర్జీ ప్రతిచర్యలు ఉండవచ్చు. అందుకే కొబ్బరి నీరు అంటే అలర్జీ ఉన్న వ్యక్తులు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. అయితే కొబ్బరినీరు మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే పలు సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. కాబట్టి కొబ్బరి నీటిని మితంగా మాత్రమే తీసుకోవాలని లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చని చెబుతున్నారు.