Site icon HashtagU Telugu

Calcium vitamin B12 : విపరీతంగా కాళ్లు, చేతులు లాగుతున్నాయా? కాల్షియం, విటమిన్ 12 టెస్టు చేయించుకోండి!

Calcium Deficiency

Calcium Deficiency

Calcium vitamin B12 : ఒకప్పుడు నిండు ఆరోగ్యంతో ఉండే ప్రజలు ప్రస్తుత రోజుల్లో తరచూ ఏదో ఒక జబ్బుతో ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా అలసిపోవడం, కీళ్ల నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.చిన్న చిన్న పనులకే నీరసించిపోవడం, చిరాకు పడటం వంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. దీంతో వైద్యుడిని సంప్రదించడం వారికి నిత్య క్రమంగా మారిపోయింది. తీరా చూస్తే కాల్షియం, విటమిన్ బి12 లోపం వలనే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.

కాల్షియం లోపంతో ఏం జరుగుతుంది..

కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు వస్తాయని వైద్యుడు వివరించారు. దంతాలు బలహీనపడటం, కండరాల తిమ్మిర్లు, గుండె లయ తప్పడం వంటివి కూడా కాల్షియం లోపం వల్ల కలిగే నష్టాలే. విటమిన్ బి12 లోపం మరింత తీవ్రమైనది. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నరాల బలహీనత, నిరంతర అలసట, రక్తహీనత వంటివి తలెత్తుతాయి. ఈ రెండింటి లోపం వల్ల రాణి తన నిత్య జీవితంలో ఇబ్బందులు పడుతోందని అర్థమైంది.

“మరి దీనికి పరిష్కారం లేదా?” అంటే “ఖచ్చితంగా ఉంది!” అని వైద్యులు సూచిస్తున్నారు. “సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాలను అధిగమించవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు.” కాల్షియం కోసం పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులతో పాటు, ఆకుపచ్చ కూరగాయలు (ముఖ్యంగా బచ్చలికూర), నువ్వులు, రాగులు, సోయా పన్నీర్ (టోఫు) వంటివి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ బి12 కోసం.. ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లు, పాలు, జున్ను వంటి జంతు ఆధారిత ఉత్పత్తులను చేర్చుకోవాలి. శాఖాహారులైతే ఫోర్టిఫైడ్ పాలు (విటమిన్ బి12 కలిపిన పాలు), ఫోర్టిఫైడ్ బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, న్యూట్రిషనల్ ఈస్ట్ వంటివి తీసుకోవచ్చని డాక్టర్లు వెల్లడించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సూర్యరశ్మికి శరీరాన్ని గురిచేయడం (విటమిన్ డి కోసం, ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది) సూచిస్తున్నారు.

వైద్యుడి సలహాలు పాటిస్తూ మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే కొన్ని నెలల్లోనే ఆరోగ్యంలో మంచి గణనీయమైన మార్పులను మనం గమనించవచ్చు. అలసట తగ్గడం, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడింది. “ఆహారమే ఔషధం” అని చాలా మంది గుర్తించాలి. ఎవరికైనా పైన పేర్కొన్న సమస్యలు వేధిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఉత్తం. దీంతో మెరుగైన ఆరోగ్య శైలిని పొందవచ్చు.

TATA Cars Life Time service : టాటా ఎలక్ట్రిక్ కార్లు.. ఈ మోడల్స్‌పై జీవితకాలం బ్యాటరీ ప్యాక్ వారంటీ!