Alum: వాతావరణానికి తగ్గట్లు మన తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎలాంటి ఇన్పెక్షన్లు రాకుండా ఆరోగ్యకరంగా ఉంటాం. వేసవిలో చల్లదనం అందించే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సమ్మర్ లో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది కనుక వేడిగా ఉండే పదార్థాలు తీసుకుంటే శరీరంలో మరింత వేడిగా మారుతుంది. అందుకే శీతలపానియాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వానాకాలం, చలికాలంలో వేడి పదార్థాలు తీసుకోవాలి. ఇలా బయట వాతావరణానికి తగ్గట్లు తినే ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ సమ్మర్ సీజన్ లో ఎలా ఆహార పదార్థాలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
సమ్మర్ లో చల్లదనం కోసం పటికబెల్లం మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా పటికబెల్లంలో పోషకాలు చాలా ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తామని చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పిని దూరం చయడానికి పటిక బెల్లం బాగా ఉపయోగపడుతుందట. అలాగే డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడటానికి పటికబెల్లం బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఇక పెరుగు, పుచ్చకాయ, దోసకాయ, పుదీనాతో కలిపి కూడా పటికబెల్లం తినొచ్చని చెబుతున్నారు. దీని వల్ల డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చని అంటున్నారు. ఇక రక్తహీనత సమస్యకు పటికబెల్లం బాగా పనిచేస్తుందట. పటికబెల్లంలో ఉండే ఖనిజాలు, విటమిన్స్, అమైనో ఆమ్లాలు రక్తప్రసరణ మెరుగ్గా చేస్తుందని, బలహీనత, అలసట, కళ్లు తిరగడం, రక్తహీనత సమస్యలన్ని దూరం చేస్తుందని అంటున్నారు. అలాగే పటిక బెల్లం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని, భోజనం తర్వాత ఇవి తీసుకుంటే జీర్ణక్రియ సులువగా మారుతుందని అంటున్నారు. అలాగే దృష్టి లోపం సమస్యలను కూడా పటిక బెల్లం దూరం చేస్తుందని వైద్యం నిపుణులు చెబుతన్నారు.