Elbow Black: మోచేతులు నల్లగా అవుతున్నాయా..? ఈ చిట్కాతో తెల్లగా మార్చుకోవచ్చు

చర్మం అందంగా మెరవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. తెల్లగా మెరుస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. క్రీమ్‌లు లాంటివి చాలా వాడుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 09:13 PM IST

Elbow Black: చర్మం అందంగా మెరవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. తెల్లగా మెరుస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. క్రీమ్‌లు లాంటివి చాలా వాడుతూ ఉంటారు. అందరిలోనూ తాము ప్రత్యేకంగా, అందరినీ ఆకర్షించేలా ఉండాలని ఆరాటపడుతుూ ఉంటారు. ముఖం, చేతులు., పెదవులు, కాళ్ల అందంపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. మిగతా భాగాల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఉంటారు.

చాలామంది మోచేతులు, కాలిమడవల గురించి పట్టించుకోరు. దీంతో అవి నల్లగా మారి అందవిహీనంగా కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో కొన్ని టిప్స్ పాటించడం వల్ల అక్కడి చర్మం తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగుతో మోచేతులు, కాలిమడమల మధ్య ఉన్న నలుపును పొగోట్టి తెల్లగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు స్పూన్ల పెరుగు, లైట్ గా వెనిగర్ తీసుకుని మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత నల్లగా ఉన్న ప్రాంతంపై అప్లై చేసుకోవాలి. పావుగంట పాటు అలాగే ఉంచుకుని గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కండువాతో తుచుడుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే చర్మం తెల్లగా మారుతుంది.

ఇక మరో టెక్నిక్ కూడా ఉంది. రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగాబ బాదం కలిపి నల్లగా ఉన్న ప్రాంతం దగ్గర రాసుకుని రుద్దకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇక పెసరపిండి, నిమ్మరసం కూడా చర్మం తెల్లగా కావడానికి ఉపయోగపడుతుంది. పెసరపిండిలో కొంచెం నిమ్మరసం, బేబీ ఆయిల్ కలపాలి. ఆ తర్వాత మోచేతులు ప్రాంతంలో నల్లగా ఉన్నచోట రాసుకోవాలి. ఆ తర్వాత ఆరిన తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇక నిమ్మరసంను నల్లగా ఉన్న ప్రాంతాల్లో రోజూ అప్లై చేసుకోవాలి. నిమ్మరసం రాసుకున్న తర్వాత పది నిమిషాలు అలాగే ఉంచి క్లీన్ చేసుకోవాలి.