కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మనుషులు ఇంట్లో ఫుడ్డు కంటే బయట ఫుడ్డుని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే వంట చేసుకోవడానికి బద్దకంతో రెడీమేడ్ ఫుడ్లను ఎక్కువగా ఇష్టపడి తింటున్నారు. అలా చాలా వరకు రెడీమేడ్ ఫుడ్లకు అలవాటు పడిపోయారు. ఇలా రెడీమేడ్ ఫుడ్ లలో రెడీమేడ్ దోశ పిండి రెడీమేడ్ ఇడ్లీ పిండి అంటూ చాలామంది రెడీమేడ్ వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ రెడీమేడ్ ఇడ్లీ పిండి దోస పిండి వంటివీ వాడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.
మరి రెడీమేడ్ పిండిలు ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇడ్లీ, దోశ పిండి ప్యాకెట్స్ నిల్వ చేసేందుకు, అవి పుల్లగా మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ వేస్తారు. ఈ ప్యాకెట్స్ ని బోరిక్ యాసిడ్ తో కోటింగ్ చేసి ఆ తర్వాత అందులో పిండిని వేస్తారు. దీని వల్ల ఎక్కువ రోజులైనా పిండి పులవదు. పులిసినా మనకు తెలియదు. కాబట్టి ఇలాంటివి తినక పోవడమే మంచిది. అయితే బోరిక్ యాసిడ్ వల్ల కూడా అనేక నష్టాలు కలుగుతాయని చెబుతున్నారు. బోరిక్ యాసిడ్ కలిపిన పిండిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో పేగులు ఎఫెక్ట్ అవుతాయి. కడుపు నొప్పి పెరుగుతుంది.
అజీర్తి వంటి సమస్యకు కూడా వస్తాయి. అలాగే ప్యాకెట్ లోని పిండిని రుబ్బేటప్పుడు ఎలాంటి నీరు వాడతారో తెలియదు. గ్రైండింగ్ కూడా సరిగ్గా ఉంటుందని అనుకోలేం. కాబట్టి అలాంటివి ఏమీ ఆలోచించకుండా చాలామంది రెడీమేడ్ ని కొనుగోలు చేసి తినేస్తూ ఉంటారు. కలుషిత నీటితో పిండిని మిక్సీ పడితే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. కలుషిత నీటి ద్వారా ఎకోలీ బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, శరీరం పొడి బారడం, విరోచనాలు, పేగు, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఒకటి ఇకమీదట నైనా ఇంట్లో తయారు చేసుకొని తినడం మంచిది.
note: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే.