Site icon HashtagU Telugu

e-Cigarettes: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతున్న ఈ సిగ‌రెట్లు..!

Cigarette

Cigarette

e-Cigarettes: ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య భారతదేశంతో సహా ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ప్రజలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అతి పెద్ద కారణం పొగాకు, ధూమపానం. అంతేకాకుండా ప్రజల్లో పెరుగుతున్న ఈ-సిగరెట్ల (e-Cigarettes) వ్యసనం కూడా ఈ తీవ్రమైన వ్యాధిని ఆహ్వానిస్తోంది. అయితే ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్లను అంటే ఇ-సిగరెట్లను నిషేధించింది. కానీ నిషేధం ఉన్నప్పటికీ ఈ-సిగరెట్లను అక్రమంగా విక్రయించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ-సిగరెట్‌లపై పిఎస్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్మన్ ప్రొఫెసర్ జిసి ఖిల్నాని మాట్లాడుతూ.. ఈ-సిగరెట్‌ల వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానికి అలవాటు పడి సకాలంలో నియంత్రించుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తుందన్నారు.

Also Read: Prajabhavan : ముగిసిన బాబు – రేవంత్ ల సమావేశం..ఫైనల్ గా డిసైడ్ చేసింది ఇదే..

E సిగరెట్ అంటే ఏమిటి?

2019 సంవత్సరంలో ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ (ENDS) కింద వచ్చే ఇ-సిగరెట్‌లు మినహా అన్ని ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించింది. వీటిలో వేప్‌లు, ఇ-హుక్కా లేదా ఇ-సిగార్ మొదలైనవి ఉన్నాయి. ఇ-సిగరెట్ అనేది బ్యాటరీతో పనిచేసే సిగరెట్. ఇందులో నికోటిన్ ద్రావణం వేడిగా మారి ఆవిరి రూపంలో తాగేవారి ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. ఇవి పెన్‌లు లేదా USB డ్రైవ్‌ల వలె కనిపిస్తాయి. భారతదేశంలో ENDS ఉత్పత్తులను తయారు చేసే, విక్రయించే కంపెనీలు తమ ఉత్పత్తులు సాంప్రదాయ ఉత్పత్తుల కంటే తక్కువ హానికరం అని పేర్కొన్నాయి.

యువతలో ఈ-సిగరెట్‌ అలవాటు పెరుగుతోంది

ప్రొఫెసర్ జిసి ఖిల్నాని ఈ-సిగ‌రెట్ వాడ‌కంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనేక యూరోపియన్ దేశాలతో సహా అమెరికాలో 12.5% ​​మంది పాఠశాల పిల్లలు ఈ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. భారతదేశంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లోని యువత ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఈ రోజుల్లో ఇది ‘వేప్ పార్టీలలో’ విచక్షణారహితంగా ఉపయోగించబడుతోంది. ఇది నిజంగా ప్రమాదకరమైన దృశ్యం.

We’re now on WhatsApp : Click to Join

ఇ సిగరెట్ క్యాన్సర్‌కు కారణం కావచ్చు

ప్రొఫెసర్ జిసి ఖిల్నాని మాట్లాడుతూ.. ప్రొఫెసర్ ఎస్‌కె రెడ్డి అధ్యక్షతన ICMR ఒక కమిటీని ఏర్పాటు చేసింది (అందులో ఖిల్నాని కూడా సభ్యుడు). ఈ కమిటీ ఇ-సిగరెట్‌ల వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై శాస్త్రీయ ఆధారాలను వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ధూమపానం, పొగాకు, గుట్కా, బీడీ, సిగరెట్, ఈ-సిగరెట్ వంటివాటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆయ‌న తెలిపారు.