Site icon HashtagU Telugu

Apple: యాపిల్ ఉడకబెట్టుకుని తినవచ్చా.. పిల్లలకు తినిపించవచ్చా?

Apple

Apple

యాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతీ రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. యాపిల్ విటమిన్ సి దొరికే అద్భుతమైన పదార్ధం. ఈ ఆపిల్‌ లో బి కాంప్లెక్స్, విటమిన్ ఇ , కె కూడా ఉన్నాయి. అంతేకాదు ఆపిల్‌ లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో బాగా సహాయపడతాయి. యాపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజూ తింటే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఏం తిన్నా సరే సులువుగా జీర్ణమవుతుంది.

క్రమంగా ఇది అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యల్ని పోగొడుతుంది. ఆ సంగతి పక్కన పెడితే యాపిల్ ని డైరెక్ట్ గా లేదా జ్యూస్ రూపంలో, ఫ్రూట్ జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటాము. యాపిల్ ని నేరుగా కాకుండా ఉడకబెట్టుకుని తింటే చాలా సులువుగా జీర్ణమవుతుందట. పైగా గట్ హెల్త్ కి అవసరమయ్యే మైక్రోబయోమ్ ని ఇది విడుదల చేస్తుందని, ఈ కారణంగా మలబద్ధకం సమస్య తీరిపోతుందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయాన్ని గోరు వెచ్చని నీళ్లు తాగుతారు. అందులో నిమ్మకాయ రసం కలుపుకుంటారు. అయితే అసిడిటీ ఉన్న వాళ్లు ఉదయమే ఇలా నిమ్మరసం తాగితే మంచిది కాదట.

జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని వాళ్లు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే అవి లోపలి యాసిడ్స్ ని చల్లారేలా చేస్తాయని, తద్వారా అజీర్తి మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి ఇళా నీళ్లకు బదులుగా నేరుగా సాలిడ్ ఫుడ్ నే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ సాలిడ్ ఫుడ్ మరేదో కాదు. యాపిల్. ​యాపిల్స్ ని నేరుగా తినడం కన్నా ఉడకబెట్టి ఆ ముక్కలు తింటే ఇంకాస్త ఎఫెక్టివ్ గా అది జీర్ణ వ్యవస్థపై పని చేస్తుందట. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో యాపిల్ వేసి ఉడకబెట్టాలి. ఆ తరవాత పైన పొట్టు తీసి యాపిల్ ని ముక్కలుగా చేసుకుని ఉదయాన్నే తినాలి. పరిగడుపున ఇలా ఉడకబెట్టిన యాపిల్ తింటే గట్ హెల్త్ చాలా బాగుంటుందట.

యాపిల్ మెత్తగా ఉడకడం వల్ల తినగానే సులువుగా జీర్ణమవుతుందట. ఇది పెక్టిన్ అనే ఒక ఫైబర్ ని రిలీజ్ చేస్తుందట. ఇది ఆహారం జీర్ణం అవడంలో తోడ్పడుతుందట. ఇది ప్రిబయోటిక్ ఫైబర్ అని, దీని కారణంగా పొట్టలో గట్ మెక్రోబయోమ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉడకబెట్టిన యాపిల్ ని రోజూ తినొచ్చు. కానీ ఇది తినేటప్పుడు మాత్రం కచ్చితంగా పైన పొట్టు తీసేయాలి. ఉదయాన్నే ఇలా పొట్టుతో తింటే అది అరిగేందుకు చాలా సమయం పడుతుంది. లవంగాలు కూడా యాడ్ చేసుకోవడం వల్ల అవి బాడీని హీట్ చేయకుండానే జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయట. చిన్న పిల్లలకూ ఉడకబెట్టిన యాపిల్ పెట్టవచ్చట. కాకపోతే లవంగం వేసి నీళ్లు ఉడికించినప్పుడు వాటిని తీసేసి తినిపించడం మంచిదని, అది గోరువెచ్చగా ఉన్నప్పుడే తినిపిస్తే ఇంకా బెటర్ అని అయితే పాలిచ్చే తల్లులు మాత్రం ఈ ఉడకబెట్టిన యాపిల్ తిన్న తరవాత కనీసం రెండు గంటల పాటు ఆగి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని చెబుతున్నారు.