Weight Loss: యాపిల్ జ్యూస్ తో బరువు తగ్గవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

యాపిల్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఒక యాపిల్ పండు తీసుకుంటే వైద్యుల దగ్గరికి

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 05:15 PM IST

యాపిల్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఒక యాపిల్ పండు తీసుకుంటే వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు అని కూడా చెబుతూ ఉంటారు. యాపిల్ పండులో విటమిన్ ఏ, సి, క్యాల్షియం, పొటాషియం, పీచు పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. యాపిల్‌ లో ఫైబర్‌ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. యాపిల్ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రావు.

యాపిల్ పండును తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాపిల్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. యాపిల్ ని ముక్కల రూపంలో లేదంటే జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. కాగా యాపిల్ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా ఫిట్ గా ఉంటారా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాపిల్‌ పండ్లతో తయారు చేసిన జ్యూస్‌ తాగితే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్ జ్యూస్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

దీంతో పాటు జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ జ్యూస్‌ ప్రభావవంతంగా సహాయపడుతుంది. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ సులభంగా నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఆస్తమా సమస్యలు కూడా తగ్గుతాయి.. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ యాపిల్‌ జ్యూస్‌ చాలా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్‌ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ను తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.